🔳భద్రంగా బడికి!
రాష్ట్ర వ్యాప్తంగా పునఃప్రారంభమైన పాఠశాలలు
తక్కువ సంఖ్యలో వచ్చిన 9, 10 తరగతుల విద్యార్థులు
కరోనా కారణంగా ఇంతకాలం బోసిపోయిన పాఠశాలల్లో కొంత సందడి కనిపించింది. విద్యాశాఖ ఆదేశాల మేరకు సోమవారం బడులు తెరచుకున్నాయి. తరగతి గదులను శానిటైజ్ చేశారు. ఉపాధ్యాయులు, 9, 10 తరగతుల విద్యార్థులు చేరుకున్నారు. వారికి థర్మల్ స్క్రీనింగ్ చేశారు. గ్రామ, వార్డు సచివాలయ పరీక్ష కేంద్రాలున్న చోట సెలవు ప్రకటించారు. పాఠశాలల పునఃప్రారంభంపై తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు ముందే వాట్సప్ గ్రూపులు, ఫోన్ల ద్వారా సమాచారం అందించారు. కొవిడ్ భయంతో మొదటి రోజు విద్యార్థులు తక్కువ సంఖ్యలోనే హాజరయ్యారు. కొన్నిచోట్ల పిల్లలతోపాటు తల్లిదండ్రులూ వచ్చారు. తల్లిదండ్రుల కమిటీలతో ఉపాధ్యాయులు సమావేశాలు నిర్వహించి బోధన, ఇంటి వద్ద చేయాల్సిన కృత్యాలపై చర్చించారు.
గతేడాది అభ్యసనంపై పరీక్షలు
ఈనెల 30 వరకు 9, 10 తరగతుల విద్యార్థులకు నిరుటి పాఠాలపై పరీక్షలు నిర్వహించనున్నారు. 9వ తరగతి వారికి 8వ తరగతి, 10 వారికి 9వ తరగతిలోని పాఠ్యాంశాలపై పరీక్ష నిర్వహించి, వారి స్థాయిని అంచనా వేస్తారు. వెనుకబడిన వారికి వారం రోజులపాటు పునఃశ్ఛరణ చేస్తారు.
* కొత్త పుస్తకాలను పంపిణీ చేయకపోవడంతో విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలోని పాఠాలను అభ్యసించేందుకు అవకాశం లేకుండా పోయింది.
* ఒక్కో విద్యార్థికి మూడేసి మాస్కులు ఇస్తామని విద్యాశాఖ ప్రకటించినా ఇంతవరకు పంపిణీ చేయలేదు.

0 comments:
Post a comment