భావి ఉపాధ్యాయులకు విషమ పరీక్ష
🔰3,500 మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరం
🔰డీసెట్‌లో అర్హత సాధించనివారికి ఇబ్బందులే
🔰ఉపాధ్యాయ వృత్తి విద్య శిక్షణ ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల తీరుతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. 2018-20 బ్యాచ్ డీసెట్ ప్రైవేటు పరీక్షలో అర్హత సాధించకపోయినా పలు కళాశాలలు విద్యార్థులకు మాయమాటలు చెప్పి స్పాట్ అడ్మిషన్లు చేసుకుని రూ.లక్షలు వసూలు చేశాయి. ఏటాలాగే ప్రత్యేక అనుమతులతో పరీక్షలు రాయిద్దామనుకోగా వారి ఆశలకు ప్రభుత్వం గండి కొట్టింది. ఫలితంగా జిల్లాలో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.
🔰జిల్లాలో ప్రభుత్వ డైట్ కళాశాల మినహాయించి 94 ఉపాధ్యాయ వృత్తివిద్య శిక్షణ ప్రైవేటు కళాశాలలు(డీఈడీ) ఉన్నాయి. వీటిలో కొన్ని కళాశాలకు 150 సీట్లు, మరికొన్నింటికి 100 సీట్ల చొప్పున మొత్తం 11 వేల వరకు సీట్ల భర్తీ జరుగుతోంది. ఈ ప్రక్రియలో 80 శాతం కన్వీనర్, 20 శాతం మేనేజ్మెంట్ కోటా ద్వారా భర్తీ చేసుకుంటారు. ప్రభుత్వం నిర్వహించే కౌన్సెలింగ్‌కు సగం మందికి కూడా హాజరుకావడం లేదు. వాస్తవానికి కన్వీనర్, మేనేజ్మెంట్ కోటాలో మాత్రమే అడ్మిషన్లు చేసుకోవాలన్న నిబంధనలను ప్రైవేటు యాజమాన్యాలు తుంగలో తొక్కి స్పాట్ కింద ప్రవేశాలు చేసుకుంటున్నాయి. ఇలా 2018-20లో 3,500 మంది విద్యార్థులను అనధికారికంగా చేర్చుకున్నాయి. ఇందులో రెండు కోర్సులు చేసేవారు.. ప్రైవేటుగా మరోచోట ఉద్యోగం చేసేవారు.. ఇతర రాష్ట్రాల విద్యార్థులను ఎంట్రన్స్ రాయకనే తీసుకున్నాయి. కాగా డీసెట్-2019లో ప్రవేశ పరీక్ష రాసిన 2,400 మందిలో 2,300 మంది అర్హత, 2018-డీసెట్‌కు 9,005 మంది దరఖాస్తు చేసుకోగా 7 వేల మంది అర్హత పొందారు. 2018 బ్యాచ్‌కి సంబంధించి ఈనెల 28వ తేదీ నుంచి ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇందులో 23 కేంద్రాల్లో హాజరుకానున్న 2,643 మంది విద్యార్థులు డీసెట్‌లో అర్హత పొందినవారే.
🍁ప్రైవేటు కళాశాలల తీరిలా..
🔰కొన్ని ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థులు ఉండరు.. భవనాలు ఉండవు.. బోధకులను వెతుక్కోవాల్సిందే..! కానీ ఏటా కళాశాలలకు అనుమతులు రావడమే కాదు.. పరీక్షలు సైతం సమయానికి జరిగాయని అధికారులు ధ్రువీకరిస్తున్నారు. ఉపాధ్యాయ శిక్షణ పేరిట జిల్లాలో జరుగుతున్న తంతు ఉపాధ్యాయ వృత్తికే మచ్చ కలిగించేలా ఉంటున్నాయి. కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు రాజకీయ ప్రాబల్యాన్ని ఉపయోగించి ప్రవేశాలకు అనుమతులు తెచ్చుకుంటున్నాయి. గత మూడేళ్లలో ఉపాధ్యాయ శిక్షణ విద్యలో కౌన్సెలింగ్, యాజమాన్య కోట ద్వారా విద్యార్థుల ప్రవేశాలు తక్కువగానే ఉంటున్నాయి. కానీ ప్రవేశ పరీక్షలు రాయకుండానే స్పాట్ పేరుతో రూ.లక్షలు చెల్లించి పలువురు ప్రవేశాలు పొందుతున్నారు. సగం కళాశాలలకు పైగా పేర్లు, చిరునామా చూపించి బోగస్‌గా ఇతర కళాశాల భవనాల్లో నడుపుతున్నారు. ఒకే భవనంలో డిగ్రీ, పీజీ, బీఈడీ, డీఈడీ కళాశాలలు సైతం నిర్వహిస్తున్నారు.
🍁3,500 మంది భవిష్యత్తు ఏమిటి?
🔰కళాశాలల్లో అధ్యాపకులు ఇచ్చే తర్ఫీదు విద్యా ప్రమాణాలతోపాటు ఉద్యోగ అవసరాలకు తోడ్పడుతోంది. ఉపాధ్యాయ ఉద్యోగ భర్తీకి డీఈడీ కోర్సు కీలకమైంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల అవసరాన్ని ఆసరా చేసుకుని వ్యాపార ధోరణిలో నిర్వాహకులు ఆలోచిస్తున్నారు. అర్హత సాధించని విద్యార్థులను చేర్చుకుని వివరాలు నమోదు చేసుకుంటారు. తనిఖీలు, పరీక్షల సమయంలో మాత్రమే వారిని రప్పిస్తుంటారు. పరీక్షల సమయంలో ఉత్తీర్ణత కోసం అడ్డదారులు తొక్కుతుంటారు. ప్రభుత్వం కట్టడి చేసినా రాజకీయ నేతల సిఫార్సుల ద్వారా అనుమతులు తెచ్చుకుంటున్నారు. ఇలా చేరికలు, పరీక్షల సమయంలో ఒక్కో విద్యార్థి నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంతో 3,500 మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.

0 comments:
Post a comment