🔳నాలుగేళ్ల డిగ్రీతో నేరుగా పీహెచ్డీ
ఇక నుంచి 3-4 ఏళ్ల డిగ్రీ కోర్సులు
మూడేళ్లలో కళాశాలలన్నీ
ఎన్బీఏ, న్యాక్ గుర్తింపు పొందాలి
కాలేజీల తనిఖీలకు 10 బృందాలు
అటానమస్ కళాశాలలు పెరగాలి
జాతీయ విద్యావిధానం సమీక్షలో సీఎం
అమరావతి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇక నుంచి మూడు, నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. నాలుగేళ్ల డిగ్రీ కోర్సు చేసినవారు నేరుగా పీహెచ్‌డీలో చేరొచ్చన్నారు. రాష్ట్రంలోని అన్ని కళాశాలలు వచ్చే మూడేళ్లలో నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్(ఎన్బీఏ), నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (ఎన్ఏసీ-న్యాక్) సర్టిఫికెట్లు తప్పనిసరిగా పొందాలని స్పష్టం చేశారు. ప్రమాణాలు లేని ఇంజనీరింగ్ కళాశాలలకు నోటీసులివ్వాలని.. మూడేళ్లలో మార్పులు రాకుంటే చర్యలు తప్పవని అన్ని కాలేజీలకు చెప్పాలని సూచించారు. ప్రమాణాలు పాటించకుంటే ఇంటర్ కళాశాలలపైనా చర్యలు తీసుకోవాలన్నారు.
జాతీయ విద్యావిధానం-2020పై ముఖ్యమంత్రి సోమవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది నుంచే నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సును ప్రారంభిస్తున్నట్లు అధికారులు ఆయనకు తెలిపారు. బీఈడీ కళాశాలలు కచ్చితంగా ప్రమాణాలు పాటించి తీరాలని.. టీచర్ల శిక్షణలోనే నాణ్యత లేకపోతే వారు పిల్లలకు పాఠాలు ఎలా చెబుతారని సీఎం ప్రశ్నించారు.
‘అన్ని కళాశాలల్లో ప్రమాణాలు, నాణ్యతకు సంబంధించి ఎస్వోపీ తయారుచేసుకోవాలి. దానిప్రకారం తనిఖీ చే సేందుకు 10 బృందాలు ఏర్పాటుచేయాలి. ఒక్కో బృందంలో ముగ్గురు ఉండాలి. వీరు శాశ్వత స్క్వాడ్‌లా వ్యవహరించాలి. ఇకపై రాష్ట్రంలో ఏడాది లేకుంటే రెండేళ్ల పీజీ ప్రోగ్రామ్‌లు, మూడు లేకుంటే నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు ప్రారంభించాలి. వచ్చే ఏడాదినుంచి ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు, అదేవిధంగా నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులు ప్రవేశపెట్టాలి. విద్యార్థులకు భవిష్యత్‌లో ఉపయోగపడే అడ్వాన్స్డ్ అంశాలతో కోర్సులు ఉండాలి. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), డేటా అనలటిక్స్ వంటి కొత్త కోర్సులు, బీకామ్‌లో స్టాక్ అనాలసిస్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి అంశాలు కూడా ఉండాలి’ అని పేర్కొన్నారు. అటానమస్ కళాశాలలు పెరగాలన్నారు.
రాష్ట్రంలో దాదాపు 3 వేల కళాశాలలు ఉండగా...అందులో 104మాత్ర మే అటానమ్‌సగా పనిచేస్తున్నాయని చెప్పారు. జాతీయ అక్రిడిటేషన్ సంస్థలతో పాటు రాష్ట్రంలో కూడా అక్రిడిటేషన్ విభాగాన్ని తయారుచేయాలన్నారు. విద్యాసంస్థలన్నిటినీ ఆ దిశగా నడిపించాలని తెలిపారు. విజయనగరంలో ఇంజనీరింగ్ విద్యపై దృష్టితో, ఒంగోలులో టీచర్ ఎడ్యుకేషన్‌పై దృష్టితో కొత్తగా విశ్వవిద్యాలయాలు ఏర్పాటుచేయాలన్నారు. కళాశాలల్లో ప్రమాణాలపై ఇప్పటికే దృష్టిపెట్టామని, 200 కళాశాలలకు నోటీసులిచ్చినట్లు అధికారులు చెప్పారు. నిర్ణీత సమయంలోగా వాటిలో మార్పు రాకుంటే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.
సమీక్షలో మంత్రి ఆదిమూలపు సురేశ్ , ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్‌చంద్ర, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

0 comments:
Post a comment