భారత విద్యార్థులకు అమెరికా గుడ్న్యూస్ చెప్పింది. అమెరికాలో చదువుకునేందుకు స్టూడెంట్ వీసాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల నిరీక్షణ ఫలించనుంది. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్ వీసా ప్రక్రియను పునరుద్ధరించనున్నారు. దేశంలోని ఐదు మెట్రో నగరాల్లో ఈ నెల 17 నుంచి వీసా ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ఢిల్లీలోని యుఎస్ ఎంబసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దిల్లీలోని యూఎస్ ఎంబసీతో పాటు... హైదారాబాద్, ముంబై, చెన్నై, కోల్కతాలోని యుఎస్ కాన్సులేట్లలో సోమవారం నుంచి విద్యార్థుల వీసాల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కరోనా పరిస్థితుల కారణంగా పరిమిత సంఖ్యలోనే విద్యార్థులకు వీసాలు జారీ చేయనున్నట్లు వెల్లడించింది.
ఆగస్టు 12కు ముందుగా విజిటర్ అపాయింట్మెంట్ తీసుకున్న అత్యవసర విద్యార్థి వీసాల ప్రక్రియను ముందుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వీసాల ప్రక్రియ కొనసాగిస్తామని యూఎస్ ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపింది. కాన్సులేట్ ఉద్యోగులు, వీసా కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
అమెరికాలో కొత్త సెమిస్టర్ వచ్చే నెల ప్రారంభంకానున్న నేపథ్యంలో భారత విద్యార్థుల నుంచి వస్తున్న అభ్యర్థనల దృష్ట్యా అమెరికా ఎంబసీ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా కాలేజీల్లో అడ్మీషన్లు పొందిన వేలాది మంది విద్యార్థులు వీసా ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే ఇమిగ్రెంట్, నాన్ ఇమిగ్రెంట్ వీసా సర్వీసులను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని అమెరికా ఎంబసీ స్పష్టంచేసింది. వీలైనంత త్వరగా వీరికి కూడా వీసా సర్వీసుల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపింది. అయితే దీనికి సంబంధించిన ఖచ్చితమైన తేదీ ఏదీ వెల్లడించలేదు.

0 comments:
Post a comment