మరో వారం రోజుల్లో అన్‌లాక్ 3.0 ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్‌లాక్ 4.0 గైడ్‌లైన్స్‌ను కేంద్రహోంశాఖ సిద్ధం చేస్తోంది. అన్‌లాక్ 4లో మరిన్ని సడలింపులు ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్‌లకు అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. సెప్టెంబరు 1 నుంచి మెట్రో సర్వీసులను కూడా పునరుద్ధరించాలని యోచిస్తోంది. మెట్రో రైళ్లకు అనుమతి ఇవ్వవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఐతే స్కూళ్లకు మాత్ర అనుమతి ఇవ్వడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం మన దేశంలో కరోనా పతాక స్థాయిలో ఉందని.. ఇలాంటి పరిస్థితుల్లో స్కూళ్లు తెరవడం శ్రేయస్కరం కాదన్న భావనలో ప్రభుత్వం ఉందని సమాచారం.
కరోనా వైరస్ విజృంభించిన తర్వాత మొదటి లాక్డౌన్ నుంచి మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి.
ఢిల్లీ, చెన్నై, ముంబై, హైదరాబాద్ సహా పలు నగరాల్లో మెట్రోలు నడవడం లేదు. ఐతే అన్‌లాక్ 4లో మెట్రో సర్వీసులకు అనుమతి ఇవ్వాలని ఇటీవల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరోనా ప్రభావంతో ఢిల్లీ మెట్రోకు రూ.1300 కోట్ల నష్టం వాటిల్లింది. మిగతా నగరాల్లోనూ ఇదే పరిస్థితి.
ఐతే ప్రస్తుతం కరోనా కేసులు పెరిగినా.. రికవరీ రేటు కూడా పెరగడంతో.. మెట్రో సర్వీసులకు అనుమతి ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది.

0 comments:
Post a comment