The Center has decided to give 50 per cent salary for three months as unemployment benefit to those who have lost their jobs. It applies to everyone who is a member of the State Insurance Corporation.
కరోనా లాక్ డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన వాళ్లకు నిరుద్యోగ భృతిగా 50 శాతం శాలరీని మూడు నెలల పాటు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్ర ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో సభ్యులుగా ఉన్న ప్రతీ ఒక్కరికీ ఇది వర్తిస్తుందని తెలిపింది. ఈ ఏడాది మార్చి 24 నుంచి డిసెంబర్ 31 వరకు కరోనా విపత్తు కారణంగా ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయారో వారికి ఈ నిరుద్యోగ భృతిని చెల్లించనున్నారు.
అయితే ఈ పధకాన్ని 2021, జూన్ 30వ తేదీ వరకు పొడిగించాలని ఈఎస్ఐసీ నిర్ణయించింది. ఈ ఏడాది చివరన దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 'ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా ఈ స్కీంని పొడిగించడంతో పాటు నిరుద్యోగ భృతిని కూడా పెంచాలని అధికారులు నిర్ణయించారు'. దీనితో 30 లక్షల నుంచి 35 లక్షల మందికి లబ్ది చేకూరే అవకాశాలు ఉన్నాయి. కరోనా కాలంలో నిరుద్యోగులను ఆదుకోవాలని చాలా సెక్టార్ల నుంచి డిమాండ్లు రావడంతో కేంద్రం సానుకూలంగా స్పందించింది.

0 comments:
Post a comment