🔳TS ఎల్లుండి నుంచి బడులు
టీచర్లందరూ 27 నుంచి స్కూళ్లకు వెళ్లాలి
సెప్టెంబరు 1 నుంచి ఆన్లైన్ క్లాసులు
ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ
త్వరలో మార్గదర్శకాలు విడుదల
హైదరాబాద్, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల పునః ప్రారంభం, ఆన్లైన్ తరగతులపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. దీనికి సంబంధించి తొలిసారి ప్రభుత్వం సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 27 నుంచి ఉపాధ్యాయులందరూ పాఠశఠిాలలకు హాజరు కావాలని, సెప్టెంబరు 1 నుంచి దూరదర్శన్, టీ-సాట్ ఛానల్ ద్వారా పాఠాలు ప్రారంభించాలని విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీచర్లు ఆన్లైన్ తరగతులకు సంబంధించిన ఈ-కంటెంట్, పాఠ్యాంశ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు పాఠశాలల్లో విద్యార్థులకు అనుమతి లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు భిన్నంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆగస్టు-17 నుంచి ఉపాధ్యాయులందరూ పాఠశాలలకు వెళ్లాలని, కనీసం 50 శాతం మంది బడుల్లో ఉండాలని ఆగస్టు 10న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. కానీ సోమవారం జారీ చేసిన ఉత్తర్వులో మాత్రం సగం మంది హాజరు కావాలన్న ప్రస్తావన లేకపోగా ఉపాధ్యాయులందరూ హాజరు కావాలని అందులో స్పష్టం చేశారు.
గ్రామీణ విద్యార్థులపై మరింత కసరత్తు..
సెప్టెంబరు-1 నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ దిశగా మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయి. దూరదర్శన్, టీ-సాట్ ఛానల్ ద్వారా తరగతులు ప్రారంభించనున్న నేపథ్యంలో.. పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిర్వర్తించాల్సిన బాధ్యతలపై ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలిసింది. కాగా ఇటీవల ఎన్సీఈఆర్టీ చేసిన సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో సగానికిపైగా కుటుంబాల్లో టీవీ సౌకర్యం కూడా లేదని తేలింది. రాష్ట్రంలోనూ అనేక గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఈ విషయంపై విద్యాశాఖలో కసరత్తు నడుస్తోంది. స్మార్ట్‌ఫోన్, టీవీ సౌకర్యం లేని విద్యార్థులకు బోధన ఎలా అందించాలన్న విషయమైౖ విద్యాశాఖ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకుంది. ప్రతి గ్రామంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఒక విద్యార్థిని గుర్తించి మెంటార్‌గా నియమించే బాధ్యతలను ఉపాధ్యాయులకు అప్పగించాలని నిర్ణయించింది. దీనిపై విద్యాశాఖ ఇప్పటికే అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.

0 comments:
Post a comment