TRAI Alert: వీడియో కాల్స్ చేసేవారికి ట్రాయ్ హెచ్చరిక... ఛార్జీల మోత మోగిపోతుంది..
మీరు జూమ్, జియో మీట్, బ్లూ జీన్స్ లాంటి వీడియో కాలింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్ ఉపయోగిస్తున్నారా? అందులోని డయల్ ఇన్ నెంబర్స్ ద్వారా కాల్స్ చేస్తున్నారా? అయితే ఛార్జీల మోత మోగిపోతుంది జాగ్రత్త. సాధారణ ఛార్జీలు కావు... ఏకంగా ఇంటర్నేషనల్ కాల్, ఐఎస్డీ టారిఫ్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇటీవల కస్టమర్లు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకు అనేక కంప్లైంట్లు చేస్తున్నారు. ఇలాంటి వీడియో కాలింగ్ యాప్స్‌లోని డయల్ ఇన్ నెంబర్స్ ఉపయోగించడం ద్వారా ఛార్జీలు పడతాయని టెలికామ్ ఆపరేటర్లు కూడా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ యాప్స్‌లో ఉపయోగించే డయల్ ఇన్ నెంబర్స్ అన్నీ ఇంటర్నేషనల్ నెంబర్స్ లేదా ప్రీమియం నెంబర్స్.
కాబట్టి కస్టమర్లకు ఛార్జీలు పడతాయి.
ఈ ఛార్జీల విషయంలో ట్రాయ్‌కు అనేక కంప్లైంట్స్ వచ్చాయి. దీంతో ట్రాయ్ జోక్యం చేసుకుంది. ఈ ఛార్జీల గురించి కస్టమర్లను హెచ్చరించాలని టెలికామ్ ఆపరేటర్లను ఆదేశించింది ట్రాయ్. వాస్తవానికి ఇలాంటి వీడియో యాప్స్‌లో నిర్వహించే మీటింగ్స్‌లో డయల్ ఇన్ నెంబర్స్ ఉపయోగిస్తే ఛార్జీలు పడతాయన్న విషయం కస్టమర్లకు అవగాహన లేదు. ఇటీవల కరోనావైరస్ సంక్షోభంలో వీడియో కాల్స్, వీడియో మీటింగ్స్ వినియోగం బాగా పెరిగింది. వీడియో యాప్స్‌లో ఉన్న డయల్ ఇన్ నెంబర్స్‌ను యూజర్లు క్లిక్ చేయడం వల్ల ఐఎస్డీ ఛార్జీలు పడుతున్నాయి.
ఆన్లైన్ కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్స్‌లోని డయల్ ఇన్ సర్వీస్ నియమనిబంధనల్ని పూర్తిగా చదవాలని, ఎలాంటి ఛార్జీలు పడతాయో తెలుసుకోవాలని, అవసరమైతే కస్టమర్ కేర్ సెంటర్‌ను సంప్రదించాలని, వాయిస్ కాల్స్ టారిఫ్ లాంటి వివరాలు తెలుసుకొని ఈ యాప్స్ ఉపయోగించాలని ట్రాయ్ గతంలోనే యూజర్లను హెచ్చరించింది. మీరు వీడియో కాల్స్, వీడియో మీటింగ్ యాప్స్ ఉపయోగిస్తున్నట్టయితే స్మార్ట్‌ఫోన్ కాకుండా ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ ఉపయోగించడం మంచిది. దీని వల్ల మీ ఫోన్ నుంచి ఐఎస్డీ కాల్స్ కనెక్ట్ కాకుండా జాగ్రత్తపడొచ్చు.

0 comments:
Post a comment