Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Sunday, 9 August 2020

Stop the implementation of the new education policy Stalin's letter to the Prime Minister

Stop the implementation of the new education policy

 Stalin's letter to the Prime Minister

New Delhi: DMK chief MK Stalin has demanded that the Center immediately stop implementing the New Education Policy (NEP).  To this end, he wrote a letter to Prime Minister Narendra Modi and Union Education Minister Ramesh Pokhriyal on Saturday.  In the letter, the DMK leader urged the government to suspend the implementation of the new national education policy until a conducive environment is created to follow the process enshrined in the constitution.
కొత్త విద్యా విధానం అమలును ఆపండి
ప్రధాని కి స్టాలిన్‌ లేఖ
న్యూఢిల్లీ : నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి) అమలును కేంద్రం వెంటనే నిలిపివేయాలని డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌కు శనివారం లేఖ రాశారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రక్రియను అనుసరించేందుకు అనువైన వాతావరణం ఏర్పడేంతవరకు కొత్త జాతీయ విద్యా విధానం అమలును నిలిపివేయాలని డిఎంకె నేత ఆ లేఖలో కోరారు. కోవిడ్‌-19 మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుండడం, ఆర్థిక వ్యవస్థలో స్తబ్ధత నెలకొన్న ఈ పరిస్థితుల్లో పార్లమెంట్‌లో ఎలాంటి చర్చ లేకుండా ఎన్‌ఇపిని కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రుద్దడం మన ప్రజాస్వామ్య వ్యవస్థ మౌలిక సూత్రాలనే బలహీన పరుస్తుంది' అని ఆయన విమర్శించారు. ఇది మన సమాఖ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు.. '2019లో ఎన్‌ఇపి ముసాయిదాను ప్రజాభిప్రాయం కోసం ముందుంచినప్పుడు.. వివిధ నిబంధనలను డిఎంకె తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్రానికి కొన్ని సూచనలు అందించాం. ప్రస్తుతం ఎన్‌ఇపిని చూస్తే అప్పటి ముసాయిదాకు ఏ మాత్రం భిన్నంగా లేదు. ఎటువంటి సిఫార్సులనూ చేర్చలేదు' అని లేఖలో పేర్కొన్నారు. ప్రతిపాదిత విధానం రాష్ట్రాల అధికారాలను అణగదొక్కడమే కాకుండా దేశంలో విద్యాసాధన, అందుబాటు, నాణ్యతలో సాధించిన పురోగతికి విఘాతం కలిగిస్తుందని తెలిపారు. సామాజిక న్యాయం, సమానత్వానికి మరిన్ని అడ్డంకులు సృష్టించారని అన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల విద్యార్థులు విద్యను పొందడానికి అనేక ప్రతిబంధకాలను ఎదుర్కోవలసి ఉంటుందన్నారు. తప్పనిసరిగా తమిళం నేర్చుకోవాలనే నిబంధనతో ఇప్పటికే ద్విభాషా విధానం రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ప్రతిపాదించిన త్రిభాషా విధానంలో అన్ని పాఠశాలల విద్యా స్థాయిల్లో సంస్కృతాన్ని రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని, దీన్ని అంగీకరించేది లేదని అన్నారు. ఈ చర్య తమిళ భాష కీర్తిని, గౌరవాన్ని బలహీనపరుస్తోందని, తమిళ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని విమర్శించారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు భారం తగ్గించేందుకు జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చామని కేంద్రం చెబుతోందని, 3, 5, 8 తరగతులకు సంబంధించి ఈ ఉద్దేశానికి విరుద్ధంగా ఉందన్నారు. కళాశాల ప్రవేశాలకు ప్రవేశ పరీక్షలను నిర్వహించాలనడం అట్టడుగున ఉన్న విద్యార్థుల పట్ల వివక్ష చూపడమేనన్నారు. ఎన్‌ఇపిలో ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి వంటి సామాజికంగా వెనుకబడిన రిజర్వేషన్ల గురించి ప్రస్తావించలేదని, మహిళల నిష్పత్తిని పెంచేందుకు ఎలాంటి చర్యలు లేవని వివరించారు. రాష్ట్ర హక్కులను అణగదొక్కి, దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే పలు అంశాలు దీనిలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top