schools reopen next month 5th ... AP Minister who once again gave clarity
వచ్చే నెల ఐదునే స్కూళ్ళు...మరో సారి క్లారిటీ ఇచ్చిన ఏపీ మంత్రి
నరసరావుపేట జేఎన్టీయూ భవన సముదాయానికి శంకుస్థాపన చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్ వచ్చే నెల ఐదో తేదీన విద్యా సంస్థలు తెరవాలని ప్లాన్ చేస్తున్నామని అన్నారు. విద్యా సంవత్సరం మూడు నెలల పాటు కొల్పోయాం కాబట్టి ఆ మేరకు సిలబస్ ను రూపొందించనున్నామని పేర్కొన్నారు. అదే రోజున జగనన్న విద్యా కానుక అందిస్తామని, జగనన్న విద్యా కానుక కిట్లను గ్రామాలకు పంపుతున్నామని అన్నారు. గత నాలుగేళ్ల నుంచి జేఎన్టీయూ నరసరావుపేటలో కొనసాగుతున్నా సొంత భవనాలు కట్టని దుస్థితి నెలకొందని అన్నారు.
విద్యకు గత ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదని స్పష్టంగా కన్పిస్తోందని, కొన్ని యూనివర్శిటీల ఏర్పాటుకు గత ప్రభుత్వం కొన్ని జీవోలతోనే సరిపెట్టిందని అన్నారు.
కానీ వైఎస్ జగన్ సర్కార్ విద్యకు పెద్ద పీట వేసిందని, వికేంద్రీకరణ ద్వారా జరిగే అభివృద్ధి ఎలా ఉంటుందో విద్యా శాఖలోనే కన్పిస్తుందని అన్నారు. ప్రీ ప్రైమరీ విద్యను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్న ఆయన అంగన్వాడీ సెంటర్లకి ఈ ప్రీ ప్రైమరీ స్కూళ్లను అనుసంధానం చేస్తామని అన్నారు. ప్రీ ప్రైమరీ స్కూళ్ల కరిక్యులెమ్ 15 రోజుల్లో సిద్దం చేస్తామని, మిగిలిన అంగన్వాడీ సెంటర్లల్లో కూడా నాడు-నేడు కార్యక్రమం అమలు చేస్తామని అన్నారు.

0 comments:
Post a comment