దిల్లీ: కాలం చెల్లిన (లాప్స్డ్) పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశాన్ని పాలసీదార్లకు ఇస్తున్నట్లు భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఆదివారం ప్రకటించింది. నేటి (ఆగస్టు 10) నుంచి అక్టోబరు 10 వరకు కాలం చెల్లిన పాలసీలను ఖాతాదారులు పునరుద్ధరించుకోవచ్చని తెలిపింది. టర్మ్ పథకాలు, అధిక నష్టభయం ఉన్న పథకాలు మినహా ఇతరాలకు వైద్య పరమైన మినహాయింపులు ఏమీ ఇవ్వడం లేదని, అయితే ఆలస్య రుసుము విషయంలో ఉంటుందని పేర్కొంది. అర్హత కలిగిన కొన్ని పథకాలను, వాయిదా చెల్లించని తేదీ నుంచి అయిదేళ్లలోపు అయితే పునరుద్ధరించుకునే వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది.
ఆలస్య రుసుములో 20 శాతం మినహాయింపు ఉంటుందని, ఇదే రూ.1-3 లక్షలలోపు అయితే 25 శాతం మినహాయింపు ఉంటుందని పేర్కొంది. పాలసీ కాలావధి ముగియని వాటినే పునరుద్ధరించుకునే వీలుందని స్పష్టంచేసింది.
0 comments:
Post a comment