Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Tuesday, 11 August 2020

Pranab Mukherjee : వెంటిలేటర్‌పై ప్రణబ్ ముఖర్జీ... కరోనాతోపాటూ మరో సమస్య


Pranab Mukherjee : రాజకీయాల్లో వివాద రహితుడిగా... ఇంకా చెప్పాలంటే... ట్రబుల్ షూటర్‌గా పేరున్న ప్రణబ్ ముఖర్జీని అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఆయన బ్రెయిన్‌లో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించేందుకు సర్జరీ చేసిన తర్వాత ఆయన్ను వెంటిలేటర్ సపోర్టుపై ఉంచారు. దానికి తోడు... తనకు కరోనా సోకినట్లు ఈ మాజీ రాష్ట్రపతి నిన్న దేశ ప్రజలకు ట్విట్టర్ ద్వారా తెలిపారు. దేశంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది. సామాన్యూలతో పాటు అనేక మంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఆ జాబితాలోకి మాజీ రాష్ట్రప్రతి ప్రణబ్ ముఖర్జీ కూడా చేరిపోవడం ఎంతో మందిని బాధించింది. దాదా త్వరగా కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు. తాను వేరే కారణాల వల్ల ఆస్పత్రికి వెళితే..
కోవిడ్ 19 పాజిటివ్ అనే విషయం నిర్థారణ అయ్యిందని ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. తనను గత వారం రోజులుగా కలిసిన వారంతా సెల్ఫ్ ఐసోలేషన్ పాటించి.. కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.
ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి వర్గాల ప్రకారణం... సర్జరీ తర్వాత కొన్ని గంటలపాటూ ప్రణబ్‌కి ఏ సమస్యా రాలేదు. ఆ తర్వాత పరిస్థితి క్రిటికల్‌గా మారింది. దాంతో వెంటిలేటర్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఆయనకు కరోనా కోసం వెంటిలేటర్ ఏర్పాటు చేయలేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. నిజానికి 84 ఏళ్ల ప్రణబ్‌కి కరోనా లక్షణాలు తక్కువగానే ఉన్నట్లు తెలిసింది.
కరోనా సమస్య లేకపోయి ఉంటే... ప్రణబ్ త్వరగా కోలుకోవడానికి వీలవుతుందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కరోనా కారణంగా... కోలుకునేందుకు కొద్దిగా ఎక్కువ టైమ్ పడుతుందని అంటున్నారు. ఓవైపు కరోనాకి మందులు ఇస్తూ.. మరోవైపు సర్జరీకి సంబంధించిన ట్రీట్‌మెంట్ చెయ్యాల్సి ఉంటుంది. వచ్చే కొన్ని గంటలపాటూ... కండీషన్ క్రిటికల్ గానే ఉంటుందని తెలిసింది.
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్... సోమవారం ఆస్పత్రికి వెళ్లి ప్రణబ్ ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. దాదాపు 20 నిమిషాలు ఆస్పత్రిలోనే ఉన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్సి రణదీప్ సుర్జేవాలా, ఇతర పార్టీ నేతలు, కొలీగ్స్... అందరూ దాదా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సైతం కరోనా సోకింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరోనా బారిన పడ్డారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం కోవిడ్ 19 సోకడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని వైరస్ నుంచి బయటపడ్డారు. కోవిడ్ 19 సోకడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు కర్ణాటక సీఎం యడియూరప్ప.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top