Post Office Savings Account: ప్రభుత్వ సబ్సిడీలు కావాలంటే ఇలా చేయండి..
మీకు పోస్ట్ ఆఫీసులో సేవింగ్స్ అకౌంట్ ఉందా? ప్రభుత్వ పథకాలకు చెందిన సబ్సిడీలను మీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి పొందాలనుకుంటున్నారా? అయితే మీ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయాలి. మీరు ఎలాంటి ప్రభుత్వ పథకాల సబ్సిడీ పొందాలన్నీ ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి. మీరు ఆధార్ లింక్ చేస్తే వేర్వేరు ప్రభుత్వ పథకాలకు చెందిన నగదు బదిలీ నేరుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకే వస్తుంది. మీరు పోస్ట్ ఆఫీసులో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేప్పుడు ఆధార్ లింక్ చేయనట్టైతే మళ్లీ రివైజ్డ్ అప్లికేషన్, ఆధార్ సీడింగ్ మ్యాండేట్ ఫామ్ ఇవ్వాలి. దీంతో పాటు మీ ఆధార్ కార్డ్ కాపీ కూడా జత చేయాలి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్‌కు ఆధార్ సీడింగ్ చేస్తే ఇకపై అదే అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి.
మీరు ఆధార్ సీడింగ్ మ్యాండేట్ ఫామ్ ఇచ్చేప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. యూఐడీఏఐ నుంచి మీ ఆధార్ వివరాలు ఆథెంటికేట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలి. ఎస్ఎంఎస్ అలర్ట్స్ పంపేందుకు మీ మొబైల్ నెంబర్‌ను వెల్లడించాలి. ఇప్పుడు ఉన్న అకౌంట్‌కే కాకుండా భవిష్యత్తులో ఓపెన్ చేసే అకౌంట్లకు కూడా ఆధార్ నెంబర్ లింక్ చేయాలని తెలపాలి. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌కు మీ ఆధార్ నెంబర్ లింక్ అయిన తర్వాత ప్రభుత్వ సబ్సిడీలు ఆ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. ఎల్పీజీ సబ్సిడీ, పీఎం కిసాన్ లాంటి పథకాలకు చెందిన సబ్సిడీలు పొందొచ్చు. మీరు ఒక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ నుంచి మరో పోస్ట్ ఆఫీస్ అకౌంట్‌కు సబ్సిడీలు పొందాలన్నా ఇలాగే దరఖాస్తు చేయాలి.
మీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేసేప్పుడు మీ అకౌంట్లోని పేరు, ఆధార్ కార్డులోని పేరు, ఇతర వివరాలు సరిగ్గానే ఉన్నాయో లేదో చెక్ చేయాలి. లేకపోతే నగదు బదిలీలో ఇబ్బందులు రావొచ్చు. పీఎం కిసాన్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడంలో ఇలాంటి సమస్యలే వచ్చాయి. అకౌంట్లోని పేరు, ఆధార్ కార్డులోని పేరు మ్యాచ్ కాకపోవడం వల్ల లక్షలాది మంది రైతులకు నగదు బదిలీ ఆగిపోయింది. కాబట్టి వివరాలన్నీ ఒకేలా లేకపోతే వాటిని అప్డేట్ చేయడం మంచిది.

0 comments:
Post a comment