ఇది కరోనా సమయం.. కోట్లాది మంది ఉపాధి కోల్పోతే.. లక్షలాది మంది ఉద్యోగాలను దెబ్బకొట్టింది... ఉద్యోగాలు ఉన్నవాళ్లకు చాలా మంది ఇప్పటికీ జీతాల్లో కోతపడుతూనే ఉంది. అయితే, ఇదే సమయంలో... సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతూ.. అందినకాడికి నొక్కేస్తున్నారు.. ఈ తరుణంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో)... పీఎఫ్ ఖాతాదారులకు సోషల్ మీడియా వేదికగా ఓ హెచ్చరిక చేసింది... పీఎఫ్ ఖాతాదారులు.. వ్యక్తిగత వివరాలను ఫోన్ ద్వారా కానీ.. సోషల్ మీడియా ద్వారా కానీ ఎవ్వరికీ చెప్పొద్దని కోరింది.
మీరు చేసే ఒకే ఒక్క చిన్న తప్పుతో మీ ఖాతా మొత్తం ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది ఈపీఎఫ్వో..
మీకు ఏదైనా సమస్య ఉంటే.. 1800118005 నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించింది. సోషల్ మీడియా వేదికగా ఖాతాదారులకు వార్నింగ్ ఇచ్చిన ఈపీఎఫ్వో.. ఆధార్ నెంబర్, యూఏఎన్ నెంబర్, పాన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ వంటి మీ వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియా లేదా.. ఫోన్ ద్వారా ఎవ్వరికీ తెలియజేయవద్దని హెచ్చరిస్తూ ట్వీట్ చేసింది.

0 comments:
Post a comment