Pension Scheme: ఈ పథకంలో 2.4 కోట్ల మంది చేరారు... నెలకు రూ.5,000 పెన్షన్ గ్యారెంటీ...
అటల్ పెన్షన్ యోజన-APY స్కీమ్‌లో ఇప్పటివరకు ఎంతమంది సబ్స్క్రైబర్లు చేరారో తెలుసా? 2.4 కోట్ల మంది సబ్స్క్రైబర్లు చేరారు. కనీసం రూ.1000 నుంచి గరిష్టంగా రూ.5000 వరకు పెన్షన్ ఇచ్చే స్కీమ్ ఇది. వృద్ధాప్యంలో పెన్షన్ పొందాలనుకునేవారి కోసం కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ-PFRDA నిర్వహించే ఈ స్కీమ్‌లో 2020 ఆగస్ట్ నాటికి 2,40,10,269 మంది లబ్ధిదారులు చేరారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 17 లక్షల మంది సబ్స్క్రైబర్లు చేరారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, డిస్ట్రిక్ట్ కోఆపరేటీవ్ బ్యాంక్, అర్బన్ కోఆపరేటీవ్ బ్యాంక్, పోస్ట్ ఆఫీసుల ద్వారా ఈ పథకంలో చేరొచ్చు.
కనీసం 18 ఏళ్ల నుంచి గరిష్టంగా 40 ఏళ్ల వయస్సు ఉన్నవారు ఈ పెన్షన్ పథకంలో చేరి నెలనెలా కొంత పొదుపు చేస్తే వృద్ధాప్యంలో వారికి రూ.1000 నుంచి రూ.5000 మధ్య పెన్షన్ లభిస్తుంది. పొదుపు చేసే మొత్తాన్ని బట్టి ఈ పెన్షన్ ఆధారపడి ఉంటుంది.
ఉదాహరణకు 18 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి నెలకు రూ.210 చొప్పున అంటే రోజుకు రూ.7 లోపు పొదుపు చేస్తే చాలు. 60 ఏళ్ల వయస్సు నుంచి నెలకు రూ.5,000 పెన్షన్ పొందొచ్చు. 22 ఏళ్ల వయస్సులో ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.292 చెల్లించాలి. 40 ఏళ్ల వయస్సులో చేరితే రూ.1,454 జమ చేయాలి. అందుకే తక్కువ వయస్సులో ఈ స్కీమ్‌లో చేరితే జమ చేయాల్సిన మొత్తం తక్కువగా ఉంటుంది. 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పొదుపు చేయాలి. ఆ తర్వాత నుంచి పెన్షన్ పొందొచ్చు. ప్రతీ నెల లేదా మూడు నెలలకోసారి లేదా ఆరు నెలలకోసారి చొప్పున జమ చేయొచ్చు. పెన్షన్ తీసుకుంటున్న సమయంలో లబ్ధిదారులు మరణిస్తే వారికి పెన్షన్ కార్పస్ కూడా లభిస్తుంది. ఇది తీసుకునే పెన్షన్ పైన ఆధారపడి ఉంటుంది. పెన్షన్ రూ.1,000 అయితే పెన్షన్ కార్పస్ రూ.1,70,000, పెన్షన్ రూ.2,000 అయితే రూ.3,40,000, పెన్షన్ రూ.3,000 అయితే రూ.5,10,000, పెన్షన్ రూ.4,000 అయితే రూ.6,80,000, పెన్షన్ రూ.5,000 అయితే రూ.8,50,000 పెన్షన్ కార్పస్ లభిస్తుంది.
ఇక అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో డబ్బులు జమ చేస్తుండగానే అంటే 60 ఏళ్లలోపే సబ్‌స్కైబర్ మరణిస్తే వారి జీవిత భాగస్వామి ఈ పథకాన్ని కొనసాగించొచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ చనిపోతే వారు సూచించిన నామినీకి పెన్షన్ కార్పస్ లభిస్తుంది.

0 comments:
Post a comment