చక్కెర బదులు పటిక బెల్లం వాడితే కలిగే ప్రయోజనాలివే...
పటికబెల్లం అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది తియ్యటి రుచిని కలిగి ఉంటుంది. చెక్కర యొక్క శుద్ధి చేయబడని రూపమే ఈ పటికబెల్లం. దీన్ని వంటల్లోనూ మరియు వైద్య ప్రయోజనాల కోసం వాడతారు. పటికబెల్లం శరీరానికి చలువ చేస్తుంది, జీర్ణశక్తిని పెంచి దేహానికి బలాన్ని, వీర్యపుష్టిని ఇస్తుంది. వాత, పిత్త , కఫ దోషాల వల్ల కలిగే అనేక రోగాలకు ఔషధంగా పనిచేస్తుంది. అయితే తియ్యగా ఉందికదా అని ఎక్కువ తింటే మాత్రం మలబద్దకం వస్తుంది. ఈ క్రమంలోనే పటిక బెల్లంతో మనకు కలిగే ఇతర ఉపయోగాలు ఏమిటోఇప్పుడు తెలుసుకుందాం.
- అరటిపండును పటికబెల్లం పొడితో అద్దుకొని తింటూ ఉంటే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి.పటికబెల్లం పొడిని, పసుపు పొడిని నిప్పుల మీద చల్లి దాని వాసన రెండు పూటలా పీలుస్తూ ఉంటే జలుబు, పడిశం వంటివి తగ్గిపోతాయి .
- పటికబెల్లం పొడి 3 గ్రాములు, ఒక టీ స్పూన్ పుదీనా ఆకుల రసం కలిపి రోజూ రెండు లేక మూడు పూటలు సేవిస్తూ ఉంటే ఎక్కిళ్లు తగ్గిపోతాయి.
- శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉన్నప్పుడు అలసట అనిపిస్తుంది. అలాంటి వారికి ఉదయాన్నే నిద్రలేచి, పటికబెల్లం నీటిని క్రమం తప్పకుండా తీసుకోండి.
- నోటి పుండు ఉంటే, ఏలకులతో పటిక బెల్లం కలపడం ద్వారా పేస్ట్ తయారు చేసి, ప్రతిరోజూ ఉదయం నీటితో కలిపిన ఈ పేస్ట్ త్రాగాలి. ఇలా చేయడం ద్వారా నోటి బొబ్బలు మాయమవుతాయి.
- వేడివేడి పాలల్లో పటికబెల్లం పొడి కలిపి రెండు లేక మూడు పూటలు తాగితే అతిగా మాట్లాడటం వలన వచ్చే గొంతు బొంగురు తగ్గిపోతుంది.- నిమ్మపండు ముక్క మీద కొద్దిగా పటికబెల్లం పొడి అద్ది బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూ ఉంటే వాంతులు తగ్గిపోతాయి .
- మీరు భోజనం చేసిన తరువాత నోరు కడుక్కోకపోయినా, నోరు పుక్కిలించకపోయినా, ఆ బాక్టీరియా చిగుళ్ళ సందుల్లో ఉండిపోయి చెడు వాసన కలిగిస్తుంది. పటిక బెల్లం భోజనం తరవాత తింటే ఈ చెడు వాసన పోగొట్టి , తాజా శ్వాస నింపుతుంది.

0 comments:
Post a comment