ఆన్లైన్ చదువులు.. అందని ద్రాక్షేనా?
27శాతం మందికి లేని ఎలక్ర్టానిక్ పరికరాలు
28శాతం మందికి విద్యుత్ కోతలు
ఇంటర్నెట్ డెస్క్: కరోనా మహమ్మారి రాకతో విద్యారంగంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. ఆన్లైన్ విద్యాబోధన తెర మీదికి వచ్చింది. అసలు ఎంత మందికి ఈ బోధన అందుబాటులో ఉందో తెలుసుకునేందుకు ఎన్సీఈఆర్టీ సర్వే చేయగా దేశంలో సుమారు 27శాతం మందికి కనీసం ఏ విధమైన డిజిటల్ పరికరం కూడా అందుబాటులో లేదని తేలింది. మరో 28శాతం మంది విద్యుత్ కోతలతో సతమతమవుతున్నట్లు వెల్లడైంది. ఆన్లైన్ పాఠాల్లో గణితం, సైన్స్ వంటి సబ్జెక్టుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు విద్యార్థులు పేర్కొన్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు కేంద్రం ఏ చర్యలు తీసుకోనుందో వేచి చూడాల్సి ఉంది.
కరోనా విలయంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లి చదువుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆన్లైన్ తరగతులు తెర మీదికి వచ్చాయి. ఈ తరగతులు వినేందుకు కనీసం స్మార్ట్ఫోన్ లేదా ల్యాప్టాప్ అందుబాటులో ఉండాలి. దేశంలో 27శాతం మంది విద్యార్థులకు ల్యాప్టాప్, స్మార్ట్ఫోన్లు లేవని ఎన్సీఈఆర్టీ సర్వేలో తేలింది. మరో 28శాతం మందికి ఇవి అందుబాటులో ఉన్నా విద్యుత్ కోతలు తదితరాలతో ఆన్లైన్ తరగతులకు హాజరవడం కష్టంగా మారుతోంది. దేశవ్యాప్తంగా సుమారు 34వేల మంది ఈ సర్వేలో తమ అభిప్రాయాలు చెప్పినట్లు ఎన్సీఈఆర్టీ పేర్కొంది. వీరిలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, సీబీఎస్ఈ గుర్తింపు పొందిన పాఠశాలల ప్రిన్సిపల్స్ పాల్గొని తమ అభిప్రాయాలు తెలిపారు. దేశంలో ఎక్కువ శాతం మంది స్మార్ట్ ఫోన్లను ఆన్లైన్ తరగతులకు వినియోగిస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆన్లైన్ తరగతుల కోసం తమ దగ్గరున్న ఎలక్ర్టానిక్ పరికరాలను సరిగ్గా ఉపయోగించుకోవడం తెలియడం లేదని సర్వేలో తేలింది. ఆన్లైన్ విద్యాబోధన విషయంలో ఉపాధ్యాయులకు కూడా సరైన శిక్షణ లేకపోవడం వల్ల విద్యార్థులకు ఆశించిన స్థాయిలో లబ్ధి చేకూరడంలేదని సర్వే చెబుతోంది.

0 comments:
Post a comment