దేశభక్తికి సంబంధించిన ఎన్నో ఘటనలు వెలుగు చూస్తుంటాయి... ముఖ్యంగా విధి నిర్వహణలో ఉన్న జవాన్లు, పోలీసు తమకు ఎదురయ్యే వ్యక్తిగత సమస్యలను పక్కనబెట్టి... స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఘటనలు ఎన్నో.. ఇక, తాజాగా, ఆగస్టు 15వ తేదీన తమిళనాడులో ఓ మహిళా ఇన్ స్పెక్టర్ దేశభక్తిని చాటుకుంది. తండ్రి మరణించాడని తెలిసినా, ఇండిపెండెన్స్ డే పరేడ్లో పాల్గొంది. ఇక, పరేడ్ ముగిసిన తర్వాత తండ్రి అంత్యక్రియలకు హాజరై.. తనకు దేశంపై, విధి నిర్వహణపై ఉన్న ప్రేమను చాటింది.
వివరాల్లోకి వెళ్తే.. మహేశ్వరి ఆర్ముడు రిజర్వు ఇన్ స్పెక్టర్.. శనివారం తిరునల్వేలి జిల్లాలో జరిగిన ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పరేడ్ కు ఆమె నాయకత్వం వహించారు.
అయితే, ఇండిపెండెన్స్ డే తెల్లారి అనగా, శుక్రవారం రాత్రి ఆమె తండ్రి మరణించారు. అయినప్పటికీ ఆమె వెంటనే ఇంటికి వెళ్లకుండా ఆగిపోయింది. ఈ సమయంలో తాను వెళ్లిపోతే, ఇంత తక్కువ సమయంలో మరొకరు పరేడ్ బాధ్యతలు నిర్వహించడం సాధ్యం కాదని భావించిన మహేశ్వరి.. డ్యూటీకే ప్రాధాన్యమిచ్చింది.
తన తండ్రి చనిపోయిన బాధను దిగమింగి, ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు. పరేడ్ ముగిసిన తర్వాత వెళ్లి తన తండ్రి నారాయణసామి అంత్యక్రియల్లో పాల్గొంది. దేశంపట్ల తనకు ఉన్న ప్రేమకు.. డ్యూటీపై ఆమె చూపించిన శ్రద్ధకు మహేశ్వరిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

0 comments:
Post a comment