Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Thursday, 20 August 2020

Maha Yogi Narayana Guru - అక్షరయజ్ఞం చేసిన మహాయోగి నారాయణ గురు (ఆగస్టు 20 నారాయణ గురు జయంతి సందర్భంగా)

అక్షరయజ్ఞం చేసిన మహాయోగి నారాయణ గురు
(ఆగస్టు 20 నారాయణ గురు జయంతి సందర్భంగా)
'విద్య ద్వారానే స్వేఛ్చ.. సంఘటితమవడం ద్వారానే శక్తి.. చదువు అనేది స్వేఛ్చ, సమానత్వాలను సాధించడానికి నిచ్చెనలా ఉపయోగపడుతుంది' అని ప్రభోదించిన మహాగురువు నారాయణ గురు. విద్య అనే ఆయుధం ద్వారా లక్షలాది మంది అణగారిన ప్రజలను విముక్తుల్ని చేశారు. విద్యతోనే దళితులకు, స్త్రీలకు ఆత్మగౌరవం వస్తుందని ప్రబోధించిన జ్ఞాని నారాయణ గురు. నారాయణ గురు కేరళకు చెందిన ఒక సంఘసంస్కర్త. సమాజంలోని మూఢ విశ్వాసాలను, కుల తత్వాన్ని నిరసించాడు. కులం కారణంగా కొన్ని వర్గాలకు చెందిన ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని, వారికి ఆధ్యాత్మిక స్వేచ్ఛ, సామాజిక స్వాతంత్ర్యం ఉండాలని ఆయన భావించాడు. వారిని ఉద్ధరించడానికి ఆలయాలు, పాఠశాలలు మొదలైన సంస్థలు నెలకొల్పడానికి పాటు పడ్డాడు. నారాయణ గురు కేరళ రాజధాని తిరువనంతపురానికి పదకొండు కిలోమీటర్లు దూరంలో చెంపళంతి గ్రామంలో 1856లో ఆగస్టు 20న జన్మించారు. మాదన్ ఆశన్, కుట్టి అమ్మ ఆయన తల్లిదండ్రులు. తండ్రి ఒక మధ్య తరగతి రైతు. సొంతూళ్లో ఉపాధ్యాయుడు.  నారాయణను వారు ప్రేమగా 'నానూ' అని పిలుచుకునేవారు. ఐదవ ఏట ఆయన తన విద్యాభ్యాసాన్ని పాత 'గురుకుల' పద్ధతిలో పొరుగునే ఉన్న పాఠశాలలో ప్రారంభించారు. మాదన్ ఆశన్‌ కూడా ఉపాధ్యాయుడే. ఆయన సంస్కృతం నేర్చుకున్నారు. ఆయనకు జ్యోతిశ్శాస్త్రంలోనూ, ఆయుర్వేదంలోనూ మంచి ప్రవేశం ఉంది. వయలవరంలోని ఆయన ఇల్లు అత్యున్నత సామాజిక బాధ్యతను, ఆర్థిక హోదాను అనుభవించింది. నానూకు ముగ్గురు సోదరీమణులున్నారు. ఆరోజుల్లో సమాజం ఉన్నత కులం, తక్కువ కులాలుగా విభజితమై ఉంది. సమాజం పూర్తిగా కుల వ్యవస్థ గుప్పిట్లో ఉంది. ప్రజలు అస్పృశ్యతను పాటించేవారు. పరస్పరం సహకారం అందించుకునేవారు కాదు. నారాయణగురు ఉద్యమంలో ప్రధానమైంది అణగారిన ప్రజలకు విద్య. ఆయన గుడుల్లో బడులు నిర్వహించారు. మానవులందరూ సమానమని పేర్కొన్నారు. ఆయన ప్రతి మనిషి చదువుకోవాలని, దేవుడు వేరే లేడని, మనలోనే ఉన్నాడని సందేశమిచ్చాడు.    స్పష్టమైన అవగాహనతో దళితులు, స్త్రీల విముక్తి కోసం ఆయన ఉద్యమించాడు. నారాయణగురు చిన్నతనంలోనే సంస్కృతాన్ని అభ్యసించారు. తల్లిదండ్రుల దగ్గర, గురువుల దగ్గర విద్యాభ్యాసం చేశారు. ఆయుర్వేద విద్యను కూడా ఆయన చిన్నతనంలోనే నేర్చుకున్నారు. ఏ విద్య అయినా ఏ కులానికైనా వస్తుందనేది ఆయన ప్రధాన ఉద్దేశం. ఆయన కుల, మత భేదాలను నిరసించారు. జ్ఞానం అనేది స్వయం సంపార్జితం అని చెప్పారు. బుద్ధుని సూత్రాలు ఎన్నో ఆయన బోధనలో వ్యక్తమవుతాయి. ఆయన గుడిలో కేవలం దేవుణ్ణి పూజించటమేకాక గుడిని  విద్యాలయంగా మార్చారు. ముఖ్యంగా భక్తి కవుల మార్గాన్ని ఆయన తీసుకున్నారు. ఆ రోజుల్లో కేరళలో నంబూద్రిపాదులు, బ్రాహ్మణులు తీవ్రమైన వర్ణ, కుల వ్యవస్థలను పాటిస్తున్నారు. అస్పృశ్యతను పాటిస్తున్నారు. నంబూద్రిపాదులు కరుడుగట్టిన వర్ణతత్వ వాదులు. నారాయణగురు తాత్విక దృక్పథం మనకు భక్తికవులను తలపిస్తుంది. భారతదేశంలో భక్తికవుల ఉద్యమం హిందూ సామ్రాజ్యవాదుల మీద తిరుగుబాటు చేసింది. ఆ తరువాత నారాయణగురు భక్తికవుల మార్గంలో విద్యా వికాస ఉద్యమం నడిపారు.  కులం పునాదుల మీద ఆయన దెబ్బకొట్టారు. నిశ్శబ్ద విప్లవం ఆయనది. బడుగుల మెదళ్ళలో అక్షర జ్యోతులు వెలిగించారు. నారాయణగురు అస్పృశ్యతా నివారణ కోసం ఎంతో కృషి చేశారు. నారాయణగురు బడుగు ప్రజల్లో నైతిక ప్రవర్తన గూర్చి బోధించారు. తాగుడు, జూదం, స్త్రీ వ్యామోహానికి దూరంగా ప్రజలు జీవించే ప్రయత్నం చేశారు. ఆయన శుభ్రతను బోధించారు. నారాయణగురు మానవతావాది. సాంస్కృతిక పునరుజ్జీవనం ఆయన బాట. నారాయణగురు ఉద్యమం ఆచరణాత్మక ఉద్యమం. మనిషిలోని కుల కల్మషాన్ని కడిగివేసి, అస్పృశ్యతా కళంకాన్ని తుడిచివేసి, మనిషిని సంస్కారవంతుణ్ణి చేసి, మనిషిని బుద్ధ జీవిని చేసి, మనిషిని సామాజిక, సాంస్కృతిక విప్లవ కారుడిగా మలిచిన నారాయణగురు ఆదర్శ జీవి, అనుసరణీయుడు. ఆయన దక్షిణ భారతదేశంలో విద్యా విప్లవ జ్యోతి. రవీంద్రనాథ ఠాగూర్ నారాయణ గురును 1922 నవంబరున శివగిరి ఆశ్రమంలో కలిశాడు. తరువాత ఠాగూర్ ఆయన గురించి నారాయణగురును మించిన లేక ఆయనతో పోల్చదగిన ఆధ్యాత్మిక వేత్తను నేను ఎన్నడూ చూడలేదని ప్రశంసించాడు. నారాయణ గురు ఒక్క కేరళలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలయిన తమిళనాడు, కర్ణాటకలతో పాటు శ్రీలంక దేశంలో కూడా దాదాపు 60 దేవాలయాలను నిర్మించాడు. దేవాలయాలు స్వచ్ఛతకు ప్రగతి కేంద్రాలుగా ఉండాలని, వాటికి అనుబంధంగా తోటలు, గ్రంధాలయాలు, ఉపన్యాస మందిరాలు, విద్యా సంస్థలు, పారిశ్రామిక సంస్థలు నారాయణ గురు స్థాపించారు. నారాయణ గురు తన సామాజిక ఉద్యమానికి దేవాలయాలను వేదికగా చేసుకున్నారు. అలాగే అవి వెనుకబడిన తరగతుల వారి ఆధ్యాత్మిక, సాంఘిక, ఆర్థిక ప్రగతికి గొప్ప సాధనాలుగా ఉపయోగపడ్డాయి.
వారసత్వంగా వచ్చే వృత్తులను బట్టి మనుషులను విభజించే విధానాన్ని నారాయణ గురు వ్యతిరేకించారు. నలభై సంవత్సరాల వ్యవధిలో నారాయణగురు సామాజిక మహాద్భుతాన్ని సాధించారు. విద్యతోనే అణగారిన వర్గాలలో అభ్యున్నతి ఉంటుందని చెప్పడమే కాకుండా ఆచరణలో చేసిచూపారు. నారాయణ గురు సెప్టెంబరు 20, 1928లో అంతిమశ్వాస వదిలారు. నారాయణగురు తెచ్చిన విప్లవం అంతరంగికమైంది, ఆచరణీయమైంది. ఆయన ఇచ్చిన స్ఫూర్తి నవ సమాజ నిర్మాణానికి బాటలు వేసింది.
- వాసిలి సురేష్
9494615360

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top