టెన్త్ పాసైనవారికి శుభార్త. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జార్ఖండ్ రాజధాని రాంచీలోని హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్-HECL జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రాంచీలో హెచ్ఈసీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో క్రాఫ్ట్స్‌మ్యాన్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్-CTS లో భాగంగా 2020-21, 2020-22 సెషన్లలో 164 ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ఆగస్ట్ 5న ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 29 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను హెచ్ఈసీఎల్ అధికారిక వెబ్సైట్ http://hecltd.com/ లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్‌ను ఇదే వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తుల్ని చివరి తేదీ లోగా పోస్టులో పంపాలి. అప్లై చేసేముందు నోటిఫికేషన్లో విద్యార్హతలు తెలుసుకోవాలి.
SSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి 8 నోటిఫికేషన్ల ఎగ్జామ్ షెడ్యూల్ ఇదే ONGC Jobs: ఓఎన్జీసీలో 4182 జాబ్స్... కాకినాడ, రాజమండ్రిలో ఖాళీల భర్తీ
మొత్తం ఖాళీలు- 164
ఎలక్ట్రీషియన్- 20
ఫిట్టర్- 40మెషినిస్ట్- 16
వెల్డర్- 40
కంప్యూటర్ ఆపరేటర్ కమ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA)- 48
దరఖాస్తు ప్రారంభం- 2020 ఆగస్ట్ 5
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 29 సాయంత్రం 5 గంటలు
విద్యార్హత- 10వ తరగతి లేదా తత్సమాన అర్హత.
వయస్సు- 2020 జూలై 31 నాటికి 14 నుంచి 40 ఏళ్ల లోపు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Principal, HEC Training Institute (HTI),
Plant Plaza Road,
Dhurwa, Ranchi-834004
Jharkhand.
0 comments:
Post a comment