జియోమార్ట్ యూజర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఏకంగా 10% క్యాష్ బ్యాక్ ప్రకటించింది. ఎస్బీఐ డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసినవారు 10% క్యాష్ బ్యాక్ పొందొచ్చు. గరిష్టంగా రూ.250 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అంటే రూ.2,500 షాపింగ్ చేస్తే రూ.250 క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు పేమెంట్ చేసిన 90 రోజుల్లో లేదా 2020 నవంబర్ 29 లోపు క్యాష్ బ్యాక్ క్రెడిట్ అవుతుంది. మీరు ఏ డెబిట్ కార్డుతో పేమెంట్ చేస్తే ఆ కార్డుకు లింక్ అయి ఉన్న ప్రైమరీ అకౌంట్లోకి క్యాష్ బ్యాక్ వస్తుంది. కనీసం బిల్ వ్యాల్యూ రూ.1,000 ఉండాలి. అంతకన్నా తక్కువ బిల్ చేస్తే క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తించదు. ఎస్బీఐ వీసా, ఎస్బీఐ మాస్టర్ కార్డ్, ఎస్బీఐ రూపే డెబిట్ కార్డులపై ఈ ఆఫర్ ప్రకటించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎస్బీఐ ప్రకటించిన ఈ ఆఫర్ 2020 ఆగస్ట్ 19 వరకు మాత్రమే.
అంటే ఈ ఒక్కరోజే ఆఫర్ పొందే అవకాశం ఉంటుంది. https://www.jiomart.com/ వెబ్సైట్ లేదా జియోమార్ట్ యాప్‌లో షాపింగ్ చేసి ఈ క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.
ఇక జియోమార్ట్ విషయానికి వస్తే రిలయెన్స్ రీటైల్‌కు చెందిన ఆన్లైన్ కన్స్యూమర్ గ్రాసరీ ప్లాట్‌ఫామ్ ఇది. ట్రయల్ ప్రాజెక్ట్ సక్సెస్ అయిన తర్వాత ఇటీవల దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో జియోమార్ట్ సేవలు ప్రారంభమయ్యాయి. భారతదేశంలో 200 నగరాలు, పట్టణాల్లో జియోమార్ట్ సేవలు అందిస్తోంది. జియోమార్ట్ ద్వారా నిత్యావసర వస్తువులు, సరుకులతో పాటు పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, హోమ్, కిచెన్ కేర్ ప్రొడక్ట్స్, బేబీ కేర్ ప్రొడక్ట్స్ కొనొచ్చు. వీటిపై అనేక ఆఫర్స్ ప్రకటించంది. త్వరలో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ఫార్మాసూటికల్, హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ కూడా డెలివరీ చేయనుంది జియోమార్ట్. ఆర్డర్ వ్యాల్యూతో సంబంధం లేకుండా ఉచితంగా హోమ్ డెలివరీ చేస్తోంది జియోమార్ట్. ఎస్బీఐతో పాటు పేటీఎం, మొబీక్విక్ లాంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా పేమెంట్ చేస్తే క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. రిలయెన్స్వన్, ఆర్వన్ లాయల్టీ ప్రోగ్రామ్, సొడెక్సో కూపన్స్ లాంటివన్నీ జియోమార్ట్ కస్టమర్లు ఉపయోగించుకోవచ్చు.
కొద్ది రోజుల క్రితమే జియోమార్ట్ యాప్ కూడా రిలీజ్ అయింది. గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్ యాప్ స్టోర్లలో జియోమార్ట్ యాప్ 10 లక్షల పైగా డౌన్‌లోడ్స్‌తో రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే.
0 comments:
Post a comment