మీరు రూ.1 లక్ష కన్నా ఎక్కువ నగలు కొంటున్నారా? రూ.20,000 కన్నా ఎక్కువ హోటల్ బిల్లులు చెల్లిస్తున్నారా? రూ.50,000 కన్నా ఎక్కువ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం చెల్లిస్తున్నారా? అయితే మీపైన ఐటీ నిఘా తప్పదు. ఇవేకాదు... ఇలాంటి అనేక లావాదేవీలపై ప్రభుత్వం నిఘా పెడుతోంది. ఆదాయపు పన్ను పరిపాలన వ్యవహారాలను సులభతరం, పారదర్శకంగా, వేధింపులు లేకుండా సంస్కరణలను అమలు చేస్తోంది మోదీ ప్రభుత్వం. అందులో భాగంగా ఇలాంటి చెల్లింపులపై నిఘా పెంచుతోంది. ఇప్పటికే రూ.2 లక్షల కన్నా ఎక్కువ ఆభరణాలను పాన్ నెంబర్ ఇవ్వకుండా కొనడాన్ని అక్రమంగా గుర్తిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఇలాంటి మరిన్ని నియమనిబంధనల్ని అమలు చేస్తోంది. వ్యక్తులతో పాటు ఆర్థికసంస్థలు ఇలాంటి లావాదేవీలను రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
భారీ కొనుగోళ్లు జరిపి వాటిపై పన్ను చెల్లించకుండా, ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకుండా తప్పించుకుంటున్నవారిపై ఆదాయపు పన్ను శాఖ నిఘా పెట్టనుంది. ఆదాయపు పన్నులో భాగంగా వెల్లడించాల్సిన ముఖ్యమైన లావాదేవీలు ఇవే.
రూ.40,000 కన్నా ఎక్కువ అద్దె.
రూ.1 లక్ష కన్నా ఎక్కువ ఎడ్యుకేషనల్ ఫీజ్ లేదా డొనేషన్.వార్షికంగా రూ.1 లక్ష కన్నా ఎక్కువ విద్యుత్ వినియోగం.
డొమెస్టిట్ బిజినెస్ క్లాస్ ఎయిర్ ట్రావెల్ లేదా ఫారిన్ ట్రావెల్.
కరెంట్ అకౌంట్లో రూ.1 కోటి కన్నా ఎక్కువ డిపాజిట్.
ఫారిన్ ట్రావెల్ కోసం రూ.2 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు.
హోటళ్లలో రూ.20,000 కన్నా ఎక్కువ బిల్లులు.
రూ.1 లక్ష కన్నా ఎక్కువ నగలు, వైట్ గూడ్స్, పెయింటింగ్, మార్బుల్ కొనుగోలు.
కరెంట్ అకౌంట్లో రూ.50 లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్ లేదా క్రెడిట్స్.
నాన్ కరెంట్ అకౌంట్లో రూ.25 లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్ లేదా క్రెడిట్స్.
వార్షికంగా రూ.20,000 కన్నా ఎక్కువ ప్రాపర్టీ ట్యాక్స్.
రూ.50,000 కన్నా ఎక్కువ లైఫ్ ఇన్స్యూరెన్స్.
రూ.20,000 కన్నా ఎక్కువ హెల్త్ ఇన్స్యూరెన్స్.
షేర్ ట్రాన్సాక్షన్స్ / డీమ్యాట్ అకౌంట్స్ / బ్యాంక్ లాకర్స్.
రూ.1 కోటి కన్నా ఎక్కువ క్యాష్ విత్‌డ్రాయల్‌పై టీడీఎస్. (నాన్ ఫైలర్స్ అయితే రూ.20 లక్షలు)
రూ.10 లక్షల కన్నా ఎక్కువ మోటార్ వెహికిల్‌కు టీసీఎస్.
ఇలా అనేక లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ నిఘా పెట్టనుంది. ఈ లావాదేవీలు జరిపినవారంతా తప్పకుండా ఆదాయపు పన్ను శాఖకు రిపోర్ట్ చేయాల్సిందే.
0 comments:
Post a comment