గృహమే కదా స్వర్గసీమ అన్నారు.. సొంతింటి కోసం అంతా కలలకు కంటూనే ఉంటారు.. కొందరు వాటిని సాకారం చేసుకుంటారు.. కొందరు ఏదో ఆస్తి అమ్మి సొంత ఇళ్లను కొనుగోలు చేస్తే.. మరికొందరు.. ముఖ్యంగా వేతన జీవులు బ్యాంకు లోన్లపై ఆధారపడతారు.. ఇక, హోం లోన్ అనగానే వెంటనే ఎస్బీఐ గుర్తుకు వస్తుంది.. ఎందకంటే.. అక్కడే వడ్డీరేటు తక్కువ.. ఇప్పుడు ఎబ్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కన్నా తక్కువ వడ్డీకే మరో బ్యాంక్ హోమ్ లోన్స్ అందిస్తోంది. అదే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
తాజాగా హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించేసింది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. . దీంతో ఇప్పుడు ఈ బ్యాంక్‌లో ఇంటి కోసం లోన్ తీసుకుంటే కేవలం 6.7 శాతం వడ్డీ రేటు ప్రారంభం అవుతుంది. దాదాపు రూ.30 లక్షల వరకు రుణాన్ని వేతనజీవులు 6.7 శాతం వడ్డీకే హోమ్ లోన్‌గా పొందవచ్చు అని ప్రకటించింది. అయితే, ఈ లోన్స్ అందరికీ వర్తించవు..
ఎందుకంటే.. క్రెడిట్ స్కోర్ 700కు పైన ఉన్నవారు.. అది కూడా మహిళలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తింపజేస్తారు. ఇక, రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల లోపు హోంలోన్ అయితే.. వడ్డీ రేటు 6.95 శాతంగా.. అదే రూ.75 లక్షలకు పైన రుణం అయితే 7 శాతంగా నిర్ణయించింది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
0 comments:
Post a comment