Google నుంచి వర్చువల్ విజిటింగ్ కార్డులు..
దిల్లీ: భారత్లోని తన వినియోగదార్లు 'పీపుల్ కార్డ్స్' సృష్టించుకోవడానికి Google మంగళవారం ఒక సరికొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇవి వర్చువల్ విజిటింగ్ కార్డులాంటివి. ఆన్లైన్లో వినియోగదార్లు తమ గురించి ఇతరులకు మరింతగా తెలియజెప్పడానికి ఇవి ఉపయోగపడతాయన్నమాట. ఈ వర్చువల్ విజిటింగ్ కార్డులో తమ వెబ్సైట్ లేదా సామాజిక మాధ్యమ ప్రొఫైళ్లు, సమాచారం, ఇతరత్రా సమాచారాన్ని ఇచ్చుకోవచ్చని Google Search మేనేజర్ లారెన్ క్లార్క్ పేర్కొన్నారు. 'ఈ కొత్త ఫీచరు ద్వారా కోట్ల కొద్దీ వినియోగదార్లు, ఔత్సాహిక పారిశ్రామికతేత్తలు, నిరుద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్నవారు, ఫ్రీలాన్సర్లు లేదా ఎవరైనా సరే..
తమను ప్రపంచం గుర్తించాలనుకున్నవారు వీటిని వినియోగించుకోవచ్చ'ని ఆమె వివరించారు. మొబైల్లో క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్లి.. Google Account ద్వారా ఈ పీపుల్ కార్డు సృష్టించుకోవచ్చని తెలిపారు.
0 comments:
Post a comment