Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Sunday, 9 August 2020

ఆగష్ట్‌ 16న 3 రాజధానుల శంకుస్థాపన.. ముఖ్య అతిథిగా మోడీ..!??

On August 16, it was reported that the Andhra Pradesh government wanted to lay the foundation stone of three capitals in Andhra Pradesh
The AP government also wants to invite Prime Minister Narendra Modi.  AP CM Jagan Mohan Reddy has asked for an appointment to meet Modi for this.  If the Prime Minister is not able to come ... at least through a video conference, they are going to ask to participate.  There is a good moment on the 16th of this month.  Beyond that ... there are no proper moments for the next 2 months.

అందరూ ఊహిస్తున్నట్లే... ఆగస్టు 16న ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించాలనుకుటున్నట్లు తెలిసింది. ఇదివరకు టీడీపీ ప్రభుత్వం అమరావతిలో ఇలాగే భూమిపూజ చేసి... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించింది. ఇప్పుడు అదే విధంగా... ఏపీ ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించాలనుకుంటోంది. ఇందుకోసం మోదీని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరారు ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి. ప్రధానమంత్రికి రావడం కుదరకపోతే... కనీసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానైనా ఇందులో పాల్గొనాలని కోరబోతున్నారు. ఈ నెల 16న మంచి ముహూర్తం ఉంది. అది దాటితే... నెక్ట్స్ 2 నెలలపాటూ సరైన ముహూర్తాలు లేవు.
అందువల్లే అదే తేదీని ఫిక్స్ చేసినట్లు తెలిసింది. అదే రోజు 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం రూ.20 వేల కోట్లతో 62 వేల ఎకరాలు సేకరించింది. ఇళ్ల స్థలాలు ఇచ్చాక... వారికి ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (గ్రామీణ/పట్టణ) కింద 2022 నాటికి ఇళ్లు నిర్మించాలన్నది ఏపీ ప్రభుత్వ ఆలోచన.

ప్రభుత్వ ప్లాన్‌కి హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో సమస్యగా మారుతోంది. CRDA, పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లులపై ఈ మధ్యే గవర్నర్ విశ్వభూషణ్ సంతకం చేశారు. వెంటనే అమరావతి రైతులు ఆ బిల్లుల అమలుపై స్టే ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు... CRDA, పరిపాలన వికేంద్రీకరణ అంశాలపై స్టేటస్ కో విధించింది. ఆగస్టు 14 లోపు ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చెయ్యాలంది. అలాగే... అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ... గత టీడీపీ ప్రభుత్వం అక్కడ నిర్మాణాలకు ఎంత ఖర్చు పెట్టింది? మరి ఆ డబ్బు ప్రజలది కాబట్టి... దాన్ని వృథా అవ్వకుండా ఏం చేస్తున్నారు? అసలు ఎంత ఖర్చైందో వివరాలు బయటపెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఇలాగైతే... ఆగస్ట్ 16న శంకుస్థాపన సాధ్యం కాదనుకుంటున్న ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. అక్కడ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. CRDA, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులపై హైకోర్టు జారీచేసిన స్టేటస్ కో ఆర్డర్‌పై స్టే ఇవ్వాలని కోరింది. నేడు ఆదివారం కాబట్టి... ఈ పిటిషన్ ఆగస్ట్ 10న సోమవారం విచారణకు రావచ్చంటున్నారు. సుప్రీంకోర్టు గనక.. హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్‌ను పక్కన పెడితే... అది ఏపీ ప్రభుత్వానికి ఊరట ఇచ్చే అంశమే. అప్పుడు శంకుస్థాపనను ఆటంకాలు లేకుండా జరిపేందుకు వీలవుతుంది.

0 comments:

Post a comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top