టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు శనివారం సాయంత్రం ప్రకటించాడు. వన్డే, టెస్ట్, టీ20 అన్ని ఫార్మట్ల అంతర్జాతీయ మ్యాచ్‌లకు గుడ్‌బై చెప్పాడు ధోనీ. 38 ఏళ్ల వయసులో తన రిటైర్మెంట్ను ప్రకటించాడు. ధోనీ చివరి సారిగా 2019 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ జట్టుపై ఆడాడు. 2019, జులై 19న ఆడిన ఆ మ్యాచే ధోనీకి చివరి అంతర్జాతీయ మ్యాచ్. ధోనీ నిర్ణయంతో క్రికెట్ అభిమానులతో పాటు టీమిండియా సభ్యులు కూడా షాక్ తిన్నారు. ఆయన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ముఖ్యంగా ధోనీ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. టీమిండియా జెర్సీలో ధోనీని ఇంకా చూడాలనుకుంటున్నామని.. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇండియా మోస్ట్ సెక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ధోనీకి పేరుంది. ధోనీ కెప్టెన్సీలో 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్ గెలిచింది టీమిండియా. అంతేకాదు 2010, 2016లో ఆసియా కప్, 2013లో ఐసీసీ చాంపియన్‌షిప్ ట్రోపీ సాధించింది. ఐపీఎల్లో చైన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఎస్ ధోనీ.. ఆ జట్టుకు మూడు సార్లు టైటిల్ అందించాడు. మ్యాచ్ గెలిస్తే సంబరాలు చేసుకోడు. మ్యాచ్ ఓడితే కుంగిపోడు. ఎప్పుడూ ఒకేలా ఉండే జార్ఖండ్ డైనమెట్‌ను అందుకే మిస్టర్ కూల్‌గా పిలుచుకుంటారు. యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలోనూ ధోనీ ముందుటాడు.
తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో 350 వన్డేలు, 98 ట్వీ20లు, 90 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు ధోనీ. వన్డేల్లో 10,773 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో 10 సెంచరీలు 73 హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు. వన్డే కెరీర్లో ధోనీ వ్యక్తిగత అత్యధిక స్కోరు 183. టెస్టుల్లో 6 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు చేశాడు. టెస్ట్ క్రికెట్లో 4,876 రన్స్ స్కోర్ చేశాడు ధోనీ. టీ20ల్లో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.
ఎంఎస్ ధోనీ 2004లో టీమిండియా జట్టులోకి అరంగ్రేటం చేశాడు. 2004, డిసెంబర్ 23న బంగ్లాదేశ్‌తో తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. 2005, డిసెంబరు 2న శ్రీలంకతో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఇక 2006లో తొలిసారి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు ధోనీ. 2006 డిసెంబరు 1న సౌతాఫ్రికాతో జరిగిన భారత జట్టులో ధోనీ సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడుతున్నాడు ధోనీ. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా ఐపీఎల్లో మాత్రం కొనసాగుతాడు. సెప్టెంబర్‌లో జరగనున్న ఐపీఎల్ టోర్నీలో ధోనీ మెరుపులు మాత్రం అభిమానులు వీక్షించవచ్చు.
0 comments:
Post a comment