పోలీస్ ఉద్యోగం మీ కలా? కానిస్టేబుల్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకు శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC ఢిల్లీ పోలీస్ రిక్రూట్మెంట్ 2020 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 5846 ఖాళీలను ప్రకటించింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC నుంచి వచ్చిన మరో భారీ జాబ్ నోటిఫికేషన్ ఇది. ఇంటర్ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ 2020 ఆగస్ట్ 1న అంటే ఇవాళే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 7 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైట్ https://ssc.nic.in/ లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్సైట్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
మొత్తం కానిస్టేబుల్ పోస్టులు- 5846
కానిస్టేబుల్ మేల్- 3433
కానిస్టేబుల్ మేల్ ఎక్స్‌సర్వీస్‌మెన్- 226కానిస్టేబుల్ మేల్ ఎక్స్‌సర్వీస్‌మెన్ కమాండో- 243
కానిస్టేబుల్ ఫీమేల్- 1944
విద్యార్హత- 10+2 లేదా ఇంటర్మీడియట్ పాస్ కావాలి.
వయస్సు- 2020 జూలై 1 నాటికి 18 నుంచి 25 ఏళ్ల లోపు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 ఆగస్ట్ 1
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 7
ఆన్లైన్లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 9
ఆఫ్‌లైన్ చలానా జనరేట్ చేయడానికి చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 11
ఆఫ్‌లైన్ చలానా పేమెంట్ చేయడానికి చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 14 బ్యాంకింగ్ వేళలు ముగిసేవరకు
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్- 2020 నవంబర్ 27 నుంచి డిసెంబర్ 14
తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్స్- హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం.
0 comments:
Post a comment