Don't sell them near school campuses anymore ... Shocking decision ...
The Food Safety and Standards Authority of India (FSAAI), the country's top food regulator, has taken a key decision with the aim of providing safe and healthy food to school children. Company CEO Arun Singhal has issued regulations on the sale of other unhealthy food, including junk food, in school canteens. The food regulator has banned unhealthy food within 50 meters of school premises.
స్కూల్ క్యాంపస్‌ల సమీపంలో ఇక వాటిని విక్రయించొద్దు...షాకింగ్ నిర్ణయం...
పాఠశాల పిల్లలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే లక్ష్యంతో, దేశంలోని అగ్రశ్రేణి ఆహార నియంత్రణ సంస్థ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSAAI) కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ సిఇఒ అరుణ్ సింఘాల్ పాఠశాల క్యాంటీన్లలో జంక్ ఫుడ్ సహా ఇతర అనారోగ్యకరమైన ఆహారాన్ని అమ్మకాలపై నిబంధనలు విడుదల చేశారు. పాఠశాల ప్రాంగణానికి 50 మీటర్ల లోపల అనారోగ్యకరమైన ఆహారాన్ని ఫుడ్ రెగ్యులేటర్ నిషేధించింది. ఆహార భద్రత, ప్రామాణిక చట్టం క్రింద పాఠశాల పిల్లలకు సురక్షితమైన, పోషకమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని FSAAI లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా కొవ్వు, ఉప్పు, చక్కెర (హెచ్ఎఫ్ఎస్ఎస్) అధికంగా ఉండే ఆహారాలరె పాఠశాల పిల్లల క్యాంటీన్లు లేదా హాస్టల్ వంటశాలల సమీపంలో 50 మీటర్ల పరిధి లోపు ఇకపై అమ్మలేరు.
పాఠశాల క్యాంటీన్లలో విక్రయించే జంక్ ఫుడ్‌ను నియంత్రించాలని 2015 లో ఢిల్లీ హైకోర్టు ఎఫ్ఎస్ఎస్ఐఐని ఆదేశించింది. ఆ తరువాత, ఉన్నత ఆహార నియంత్రణ సంస్థలోని నిపుణుల కమిటీ పాఠశాలలో పిల్లలు ఆరోగ్యకరమైన భోజనం పొందడానికి కొత్త మార్గదర్శకాలను తయారు చేసింది.అలాగే, మిడ్-డే భోజన పథకాన్ని నిర్వహించడానికి విద్యా శాఖతో ఒప్పందం కుదుర్చుకున్న ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు తప్పనిసరిగా అపెక్స్ ఫుడ్ రెగ్యులేటింగ్ ఏజెన్సీ నుండి రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ పొందాలని కూడా FSAAI సూచించింది.
ఇక పాఠశాల ప్రాంగణంలో మున్సిపల్ అధికారులు, రాష్ట్ర పరిపాలన క్రమం తప్పకుండా తనిఖీ చేసి, సురక్షితమైన, ఆరోగ్యకరమైన మరియు పరిశుభ్రమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని అధికారి తెలిపారు.
"నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పాఠశాల అధికారులు పాఠశాలలో సురక్షితమైన, సమతుల ఆహార వినియోగాన్ని ప్రోత్సహించాలి" అని మరో సీనియర్ అధికారి తెలిపారు, పాఠశాలలు ఈ నిబంధనలను తేదీ తర్వాత వెంటనే అమలు చేయాల్సి ఉంది.

0 comments:
Post a comment