House Site Pattas: సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్కు చుక్కెదురు
పేదలకు ఇళ్ల స్థలాల అంశంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చుక్కెదురైంది. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రాథమిక సాక్ష్యాధారులున్నాయని అభిప్రాయపడ్డ సుప్రీంకోర్టు.. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను కొట్టేసింది. ఈ అంశాన్ని హైకోర్టులో తేల్చుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. రాజధాని భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ రాజధాని మాస్టర్ ప్లాన్లో ఏపీ ప్రభుత్వం పలు మార్పులు చేసింది.
అయితే ఇందుకు సంబంధించి ఆర్ 5పై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై రాజధాని ప్రాంతం రైతులు, అమరావతి పరిరక్షణ జేఏసీ హైకోర్టును ఆశ్రయించింది.
దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. ఈ అంశంపై విచారణ పూర్తయ్యే వరకు స్టే కొనసాగుతుందని తెలిపింది. దీంతో హైకోర్టు విధించిన స్టేను ఎత్తేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. హైకోర్టు స్టేను సమర్థించింది. హైకోర్టులో విచారణ సరిగ్గానే జరిగిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

When the ap collages reopen?
ReplyDelete