Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Tuesday, 4 August 2020

విద్యార్థులందరికీ ఆరోగ్య కార్డులు.....

⭕విద్యార్థులందరికీ ఆరోగ్య కార్డులు.....

➪ ఎవరిలోనూ పోషకాహార లోపం ఉండకూడదు....
 ➪ మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం...
➪ చదువుపై మరింత దృష్టి పెట్టేలా చర్యలు....
➪ నూతన జాతీయ విద్యా విధానంలో ప్రతిపాదనలు....
✰పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు పౌష్టికాహార లోపం ఉంటే వారు చదువుపై పూర్తిస్థాయి దృష్టి సారించలేరు.

✰ విద్యాపరంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశం చుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే విద్యార్థులు ఆరోగ్యంగా, సంతులిత ఆహారాన్ని పొందుతూ ఉండాలి.

✰ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానంలో ఈ అంశంపై కీలక దృష్టి సారించింది.

✰ పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య, ఉపాధ్యాయ విద్యల్లోనూ గణనీయమైన మార్పులు తీసుక రావాలని, ఉపాధి కల్పనే లక్ష్యంగా విద్యావిధానం ఉండాలని కేంద్ర విద్యాశాఖ భావిస్తోంది.

✰ అందుకోసం ప్రాథమిక విద్య, విద్యార్థులు ప్రధాన దృష్టి సారించింది.

✰  అందులో భాగంగా విద్యార్థులు ఆరోగ్యంగా, పౌష్టికాహారాన్నిపొందే అవకాశాన్ని కల్పించాలని ప్రతిపాదించింది*

*➪ ఏపీలో అదనపు సౌకర్యాలు.*

✰ నూతన జాతీయ విద్యా విధానం ప్రతిపాదించిన అంశాల్లో చాలా వరకు మన రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్నాయి.

✰  మధ్యాహ్న భోజనంలో ఎనిమిదో తరగతి విద్యార్థుల వరకు కేంద్రం వాటా 60 శాతం, రాష్ట్ర వాటా 40 శాతం నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

✰ అయితే మన రాష్ట్రంలో 9, 10 తరగతుల విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం నూరుశాతం ఖర్చును భరిస్తోంది.

✰ అంతే కాకుండా జూనియర్ కళాశాలల్లో అమలు చేసే అంశంపై పరిశీలన జరుపు తోంది.

✰ మరోవైపు ఎన్ఈపీలో వేరుశనగ, బెల్లం వంటి పోషకాలు వలతో కూడిన ఆహారం, గుడ్లు అందించాలని ప్రతిపాదించగా.

✰ ఇప్పటికే మన రాష్ట్రంలో విద్యార్థులకు అవి అందిస్తున్నారు దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా  ప్రయోజ నం పొందుతున్నారు.

✰ కొత్తగా ఏ ఏపీలో ప్రతిపాదించిన ఆరోగ్య కార్డులనూ తీసుకొస్తే.. విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులు మెరుగైన మార్పు రావడం ఖాయంగా కనిపిస్తోంది

*➪ ఉదయం అల్పాహారం మధ్యాహ్న భోజనం*

✰ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ప్రస్తుతం మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు.

✰ మన రాష్ట్రంలో అయితే దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా సెలవు రోజుల్లోనూ మిడ్ డే మీల్స్ అందిస్తున్నారు.

✰ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత విద్యారంగంపై ప్రధానంగా దృష్టి సారించడంతో పాటు మధ్యాహ్న భోజన మెనూలోనూ గణనీయ మార్పులు తీసుకొచ్చారు.

✰ పౌష్టికాహారాన్ని అందించడంతోపాటు మధ్యాహ్న భోజన కార్మికులకు పెంచిన ధరలు చెల్లిస్తున్నారు.

✰ ఇదిలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన పాలసీ పిల్లలకు మధ్యాహ్న భోజనం కాకుండా ఉదయం అల్పాహారాన్ని అందించాలని ప్రతిపాదించింది.

✰ తద్వారా చిన్నారులు విద్యపై దృష్టి కేంద్రీకరించగలుగుతారని సూచనలు చేసింది.

✰ అంతే కాకుండా జాతీయ విద్యా విధానం రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన పలువురు ప్రొఫెసర్లు ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఉదయం సమయంలో పోషక విలువలతో కూడిన అల్పాహారాన్ని అందించడం ద్వారా విద్యార్థులు చదువుపై మరింత దృష్టి పెట్టగలిగినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు.

✰ ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో అల్పాహారాన్ని కూడా అందించే ఏర్పాట్లు చేయాలని సూచించారు.

✰ పాఠశాల విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటారని, అప్పుడు అభ్యసనపై చురుగ్గా దృష్టి సారించగలుగుతారని నూతన జాతీయ విద్యా విధానం సిఫార్సుల్లో కమిటీ పేర్కొంది.

✰ విద్యార్థులు పాఠశాల స్థాయిలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటే ఆరోగ్యసమస్యలు తలెత్తకుండా ఉంటాయని వెల్లడించింది.

✰ అందుకోసం విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది.

✰ విద్యార్థులకు ఆరోగ్య కార్డులు జారీ చేయడం ద్వారా వారి ఆరోగ్య పరిస్థితిపై అంచనా వస్తుంది.

✰ ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఉన్నా, ప్రత్యేకావసరాలు కావాల్సి ఉన్నా వారిపై ప్రత్యేక దృష్టి సారించవచ్చు.

✰ విద్యార్థులకు నిర్దిష్ట కాలవ్యవధిలో ఆరోగ్య కార్డుల ద్వారా పరీక్షలు చేసి, వారి ఆరోగ్య పరిస్థితులు, అవసరాల గురించిన డేటాను సిద్ధం చేయడం ఈ ప్రతిపాదన ముఖ్యలక్ష్యం.

✰ తద్వారా బలహీనమైన చిన్నారులకు పోషక విలువలతో కూడిన ఆహారంతో పాటు, అవసరమైన ఇతర వైద్య సదుపాయాలను కల్పించి, తోటి విద్యార్థులతో కలిసి ఎదిగేలా చేయవచ్చని పాలసీ సూచనలు చేశారు.

 ✰ జాతీయ ఆహార భద్రత చట్టం-2013 కూడా ఇదే సూచించింది.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top