అమరావతి: విజయవాడ నగరవాసుల చిరకాల స్వప్నం కనకదుర్గ వంతెనను సెప్టెంబర్ 4న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.సీఎం జగన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా సెప్టెంబరు 4న రాష్ట్రంలో రూ.6వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, రూ.5,700 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ కనకదుర్గ వంతెనను అదే రోజున కేంద్ర మంత్రి జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో తీసిన వంతెన డ్రోన్ వ్యూ ఆకట్టుకుంటోంది. ఇంద్రకీలాద్రిని ఆనుకుని, కృష్ణమ్మ ఒడిలో నిర్మించినట్లుగా కనిపిస్తున్న ఈ వంతెన ఔరా అనిపిస్తోంది. ఓ పక్క దుర్గమ్మ.. మరోపక్క కృష్ణమ్మ..
వీరిద్దరినీ కలిపినట్లుగా నిర్మించిన ఈ వారధి విశేషంగా ఆకట్టుకుంటోంది.
0 comments:
Post a comment