సుప్రీంకోర్టుకు వెళ్లిన ఏపీ ప్రభుత్వం... రాజధానిపై అక్కడే తేల్చుకుందామని...
హైకోర్టు...CRDA, పరిపాలన వికేంద్రీకరణ అంశాలపై స్టేటస్ కో విధించింది. ఆగస్టు 14 లోపు ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చెయ్యాలంది. అలాగే... అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ... గత టీడీపీ ప్రభుత్వం అక్కడ నిర్మాణాలకు ఎంత ఖర్చు పెట్టింది? మరి ఆ డబ్బు ప్రజలది కాబట్టి... దాన్ని వృథా అవ్వకుండా ఏం చేస్తున్నారు? అసలు ఎంత ఖర్చైందో వివరాలు బయటపెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందువల్ల ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లేదు.ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. అక్కడ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. CRDA, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులపై హైకోర్టు జారీచేసిన స్టేటస్ కో ఆర్డర్‌పై స్టే ఇవ్వాలని కోరింది. ఆగస్ట్ 9న ఆదివారం కాబట్టి... ఈ పిటిషన్ ఆగస్ట్ 10న సోమవారం విచారణకు రావచ్చంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు గనక.. హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్‌ను పక్కన పెడితే... అది ఏపీ ప్రభుత్వానికి ఊరట ఇచ్చే అంశమే. ఐతే... అమరావతిలో నిర్మాణాలకు అయిన ఖర్చు వృథా కాకుండా ప్రభుత్వం ఎలా ఉపయోగిస్తుందన్నది తేలాల్సిన అంశం. దీనిపై సరైన ప్రణాళిక లేకపోతే... ఇది ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

0 comments:
Post a comment