పెరగనున్నభూములమార్కెట్ విలువ
20 నుంచి 25 శాతం అధికంగా నిర్ణయం
ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాల స్వీకరణ
ఈ నెల 10 నుంచి అమల్లోకి..
విజయనగరం కోట, న్యూస్‌టుడే: జిల్లాలో భూముల మార్కెట్ విలువ 20 నుంచి 25 శాతం సరాసరి పెంచుతూ ప్రభుత్వం చర్యలు తీసుకొంది. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, సంయుక్త కలెక్టర్ ఇప్పటికే ధరలు నిర్ణయించారు. వీటిని స్టాంపులు, రిజిస్రేఫ్టషన్‌ల శాఖ వెబ్సైట్లో పొందుపరిచారు. వీటిని పరిశీలించి ప్రజలు అభ్యంతరాలు, సందేహాలు, సలహాలుంటే సమీప సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో లేదా ఆ శాఖ వెబ్సైట్లో తెలియజేయాలని ఇప్పటికే అధికారులు ప్రకటించారు.
నిర్మాణాలకు సంబంధించి ధరలను ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో నిర్ణయించింది. ఇవి ఈ నెల 10 నుంచి అమల్లోకి రానుంది. ప్రధానంగా విశాఖపట్టణం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న జిల్లాలోని అన్ని ప్రాంతాలకు ఈ ధరలు వర్తిస్తాయని అధికారులు అంటున్నారు. భూముల విలువ విషయానికి వస్తే సరాసరి ప్రస్తుత ధరపై 20 నుంచి 25 శాతం పెంచుతున్నారు.
మరీ తక్కువ విలువ ఉన్న చోట 35 శాతానికి పెంచి సవరిస్తున్నారు. సవరించిన వాటిని డ్రాఫ్ట్ ప్రొవిజినల్ అర్బన్ మార్కెట్ విలువలు 2020 పేరిట సంబంధిత రిజిస్ట్రార్ కార్యాలయం పరిధి అనుసరించి registration.ap.gov.in వెబ్సైట్లో పొందుపరుస్తున్నారు. ఇందులో సవరించిన ధరలు చూడొచ్ఛు భూముల మార్కెట్ విలువపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించి.. వాటిని పరిశీలించిన తరువాతే అమల్లోకి వస్తాయని జిల్లా రిజిస్ట్రార్ బాలకృష్ణ తెలిపారు.

0 comments:
Post a comment