కాలేజీల్లో నాడు-నేడు
🌼ఆంధ్రప్రభ అమరావతి🌼రాష్ట్రంలోని ప్రతి కాలేజీలో నాడు-నేడు కార్యక్రమాలు చేపట్టాలని, ఇందుకు సంబంధించి కార్యాచరణ పూర్తిచేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు తెలుగు, సంస్కృతం అకాడమీల ప్రారంభానికి అనుమతులు మంజూరుచేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ పనులు మొదలు ట్టేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో యూనివర్సిటీలు పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పాడేరులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు అంగీకారం పూర్తయిందన్నారు. ప్రతి ఏటా కచ్చితమైన నిధులు కేటాయింపుతో వచ్చే మూడు, నాలుగేళ్లలో వాటి నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. యూనివర్సిటీ ల్లో ఖాళీల భర్తీకి కూడా ముఖ్య మంత్రి అంగీకారం తెలిపారు. దాదాపు 1,110 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. ప్రభుత్వ కాలేజీలు స్వావలంబన దిశగా సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఉన్నత విద్య రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్ జస్టిస్ వంగాల ఈశ్వరయ్య, సంబంధిత శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

0 comments:
Post a comment