స్కూళ్లను ఒకేసారి తెరవొద్దు.. ఏపీ బీజేపీ డిమాండ్...
సెప్టెంబర్ 5న ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలను తెరవాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం.. అదే రోజు విద్యార్థులకు జగనన్న విద్యాకానుకను కూడా అందిస్తామని ప్రకటించింది. అయితే కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న సమయంలో విద్యాసంస్థలను పూర్తి భద్రతా చర్యలు తీసుకున్న తరువాతే తెరవాలని ఏపీ బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటన విడుదల చేశారు. ఒకేసారి విద్యాసంస్థలు తెరవడం ద్వారా లక్షణాది మంది విద్యార్థులు కలుస్తారని.. ఈ కారణంగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా కరోనా బారిన పడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇలా చేయడం వల్లే అమెరికాలో 80 వేల వరకు కేసులు నమోదయ్యాయని అన్నారు.
అయినా 60 శాతం మంది విద్యార్థులు ప్రజా రవాణాపై ఆధారపడి చదువులు కొనసాగిస్తున్నారని అన్నారు. బస్సులను పూర్తిస్థాయిలో ప్రారంభించకుండా వారు పాఠశాలలకు ఎలా వస్తారని ప్రశ్నించారు. అందుకే విద్యాప్రమాణాలు కొనసాగిస్తూ, విద్యార్థులకు రవాణా సౌకర్యంతో పాటు పూర్తి భద్రత ఇచ్చే రక్షణాత్మక చర్యలు తీసుకున్న తరువాతే దశాలవారీగా విద్యాసంస్థలు ప్రారంభించాలని ఏపీ బీజేపీ స్పష్టం చేసింది.

0 comments:
Post a comment