భూటాన్ ప్రపంచంలోనే అత్యంత సంతోషకర దేశం..ఆ దేశ సంతోషం వెనుకున్న కారణాలేంటి?...
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఉన్నాయి. ఒక్కో దేశంలో భిన్న రకాల జాతులకు చెందిన ప్రజలు జీవిస్తున్నారు. ఏ దేశంలో చూసినా పేదరికం, అవినీతి వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. అయితే అసలు ప్రపంచంలో ఏ సమస్యా లేకుండా చాలా సంతోషంగా ఉన్న దేశం ఏదైనా ఉందా ? ఏ దేశానికి చెందిన ప్రజలు అసలు ఎక్కువ సంతోషంగా ఉన్నారు ? అంటే.. అందుకు సమాధానం.. భూటాన్ అని చెప్పవచ్చు. అవును.. ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉంది భూటాన్ ప్రజలే. అందువల్ల ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం భూటాన్ అని చెప్పవచ్చు.
భూటాన్‌లో యాచకులు ఉండరు. ఇళ్లు లేని వారు అసలే ఉండరు. ప్రపంచంలో కార్బన్ నెగెటివ్ ఉన్న ఏకైక దేశం ఇదే. ఈ దేశంలో ప్లాస్టిక్ బ్యాగ్స్ కనిపించవు. వీరు టీవీ, రేడియో, ఇంటర్నెట్ గురించి అసలు పట్టించుకోరు. చాలా సాధారణ జీవితం గడుపుతారు.
ఆ దేశంలో 50 శాతం ప్రాంతం నేషనల్ పార్క్‌గా సంరక్షింపబడుతోంది. ఇక రాజ కుటుంబాలకు, సాధారణ ప్రజలకు అసలు దూరం అంటూ ఉండదు. అందరూ కలిసి మెలసి జీవిస్తారు. కాలుష్యం అన్న మాట వినిపించదు.
భూటన్ వారు తమ రాజ్యాంగం ప్రకారం తమ దేశ విస్తీర్ణంలో 6 శాతం ప్రదేశం అటవీ విస్తీర్ణం ఉండేలా చూస్తున్నారు. ప్రపంచంలో పూర్తిగా ఆర్గానిక్ విధానాన్ని అనుసరిస్తున్న దేశం కూడా భూటానే కావడం విశేషం. ఇక్కడ అసలు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండవు. అందువల్ల ట్రాఫిక్ బాధ ఉండదు.
ఇక వీరికి పర్యావరణంపై మక్కువ ఎంతంటే.. తమ దేశ రాణి బిడ్డకు జన్మనిస్తే అందరూ కలిసి 1,08,000 మొక్కలను దేశవ్యాప్తంగా నాటారు. వీరికి పర్యావరణ పరిరక్షణపై ఆసక్తి ఎక్కువ. ఇక వీరు జంతువులను అస్సలు చంపరు. ఆఖరికి దోమలను కూడా చంపరు.
భూటాన్ రాజ వంశీకులు పేదలతో కలిసి వారి కోసం అనేక పనులు చేస్తుంటారు.

0 comments:
Post a comment