మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల వస్త్రదారణ విషయంలో పలు ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. గ్వాలియర్ డివిజన్లోని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు కార్యాలయాలకు జీన్స్, టీ షర్టులు ధరించకుండా నిషేధం విధించింది. దీనికి సంబంధించిన డివిజనల్ కమిషనర్ ఎంబీ ఓజా సర్క్యూలర్ జారీ చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం జూలై 20న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించిన ఓ సమావేశానికి మాండ్సౌర్ ఇల్లాలోని ఓ అధికారి టీ షర్టు ధరించి హాజరయ్యాడు. దాంతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులంతా గౌరవ ప్రదమైన సాంప్రదాయ దుస్తుల్లో విధులకు హాజరవ్వాలని ఆదేశించారు.
ఎవరైనా దీనిని ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ల్
ఎవరైనా దీనిని ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ల్
0 comments:
Post a comment