న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు (పెన్షనర్లు) ఇక నుంచి తమ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (పీపీఓ)ను 'డిజిలాకర్'లో భద్రంగా ఉంచుకోవచ్చు. ఈ మేరకు బుధవారంనాడు ఒక ప్రకటన వెలువడింది. పెన్షనర్లకు ఒరిజినల్ పీపీఓ చాలా కీలకమని, పలువురు పెన్షనర్లు ఏదో ఒక సమయంలో తమ ఒరిజనల్ కాపీలు కనబడకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు డిపార్ట్మెంట్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ (డీఓపీపీడబ్ల్యూ) దృష్టికి వచ్చినట్టు ఆ ప్రకటన పేర్కొంది.
కొత్తగా రిటైర్ అయిన అధికారులు సైతం కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో నేరుగా వెళ్లి పీపీఓ హార్డ్ కాపీలు తెచ్చుకోవడం క్లిష్టతరంగా మారిందని పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వ శాఖ తెలిపింది.
డిజిలాకర్ అకౌంట్ ద్వారా పెన్షనర్లు తమ లేటెస్ట్ పీపీఓ కాపీ ప్రింటవుట్ అప్పటికప్పుడు పొందవచ్చని పేర్కొంది. డిజిలాకర్‌తో తమ పీపీఓలకు సంబంధించిన శాశ్వతమైన రికార్డు అందుబాటులోకి రావడంతో పాటు కొత్త పెన్షనర్లకు పీపీఏలు చేరడంలో జాప్యానికి తావుండదని మంత్రిత్వ శాఖ వివరించింది.
0 comments:
Post a comment