Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Monday, 24 August 2020

వాస్తవాలతో పొసగని విద్యావిధానం...

🔳వాస్తవాలతో పొసగని విద్యావిధానం...

దేశంలోని బాలలందరికీ నాణ్యమైన సమాన విద్య నందించాలి. అన్ని ఆదాయ వర్గాలకు సకల సామాజిక సమూహాల పిల్లలకు వారివారి పరిసర ప్రాంతాలలో సమగ్ర వసతులతో నాణ్యమైన విద్యను సమకూర్చే పాఠశాలలను ప్రభుత్వాలే ఏర్పాటు చేయాలి. అంతేకాక, ప్రతి ఒక్కరూ ఆ పాఠశాలలోనే చదువుకోవాలనే విధానం రానంత వరకు, పాఠశాల విద్య మౌలిక వాస్తవాలు మారవని గుర్తించాలి.
నూతన జాతీయ విద్యావిధానం – 2020పై దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. ఈ కొత్త విధానంలో కొన్ని ఆహ్వానించదగ్గ నిర్ణయాలు ఉన్నప్పటికీ పాఠశాల విద్యా లక్షాలను సాధించేందుకు కేంద్రం 5 నుంచి 20సంవత్సరాల గడువు విధించడంతో నూతన జాతీయ విద్యావిధానం పళ్ళెంలో పోసిన పాయసం చందంగా ఉంది. కొత్త విద్యావిధానంలో ఉన్న అనుకూల, ప్రతికూల విషయాలను పరిశీలిద్దాం. ప్రస్తుతం 6 నుంచి 14 ఏళ్ల లోపు విద్యార్థులకు అందిస్తున్న విద్యాహక్కు చట్టాన్ని 3 నుంచి 18 సంవత్సరాల విద్యార్థులందరికీ పొడిగించడం, ఆడ పిల్లల, లింగ మార్పిడి అయిన పిల్లల గురించి, అనాధలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలు, దివ్యాంగులు, వలస కూలీల పిల్లలు, పట్టణ పేదల పిల్లల గురించి శ్రద్ధ పెట్టడం, విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారాన్ని అందించడం, బాలికల కేజీబివి పాఠశాలలను 12వ తరగతికి పొడిగించడంపై జాతీయ విద్యావిధానంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఒక శుభ సూచకమే.



మరీ ముఖ్యంగా పాఠశాల విద్య కోసం పాఠ్య ప్రణాళిక రూపురేఖలను మార్గనిర్దేశం చేయడానికి పాఠశాల విద్యను పునాది (వయసు 3–8 సంవత్సరాలు), సిద్ధపాటు దశ (8–-11 సంవత్సరాలు), మధ్య దశ (11-–14 సంవత్సరాలు) ద్వితీయ దశ (14–-18 సంవత్సరాలు)గా రూపకల్పన చేయడం భారత దేశ విద్యావ్యవస్థలో ఒక మౌలికమైన మార్పు అనడంలో సందేహం లేదు. అయితే ప్రతిపాదించిన అనేక అంశాలలో నూతన విద్యావిధానం సరైన దిశను సూచించక నిరాశ పరిచింది.



పునాది విద్య (3-–8 సంవత్సరాలు): ఇప్పటి వరకు 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు పోషక ఆహారాన్ని, స్త్రీ శిశు సంక్షేమ శాఖ 15 లక్షల అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తోంది. జాతీయ విద్యావిధానం పునాది విద్యలో 3 నుంచి ౮ సంవత్సరాల వయసు వారిని చేర్చారు. కానీ అందులో అదనంగా పూర్వ ప్రాథమిక ఉపాధ్యాయుల గురించిన ప్రస్తావన లేదు. దేశంలో ఉన్న చాలా అంగన్‌వాడీలకు స్వంత భవనాలు లేవు. అదే విధంగా ఒక మంత్రిత్వ శాఖలోనే సమన్వయం కుదరదు. ఇక వివిధ మంత్రిత్వ శాఖలలో సమన్వయం ఒక సవాల్‌గా మారవచ్చు. ఐదు కోట్ల మంది విద్యార్థులకు కనీస విద్యా సామర్థ్యాలు లేవు. అనగా రాయడం, చదవడం సామాన్య లెక్కలు చేయడం కూడా రావు. ఈ విషయంలో ప్రభుత్వాలు తక్షణమే సరైన చర్య తీసుకోక పోతే వచ్చే 5 సంవత్సరాలలో 10 కోట్ల మంది విద్యార్థులు బడి వదిలి నిరక్షరాస్యులుగా మారిపోతారని కొత్త విద్యావిధానం గట్టిగా చెప్పింది. దీంట్లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా దేశంలో విద్యావిధానం గురించి మాట్లాడడం అర్థం లేని విషయమని, ఇది ఒక విద్యా సంక్షోభమని అభివర్ణించింది. ఈ దుస్థితి నుంచి బయట పడడానికి ఒక విద్యార్థి ఇంకొక విద్యార్థికి చదువు చెప్పాలని, సామాజిక కార్యకర్తలు, కమ్యూనిటీ వాలంటీర్లను నియమించడం ద్వారా, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు అలాగే సమాజంలో ఉన్న విద్యావంతులు ఒక్కొక్కరు ఒక్కో విద్యార్థికి చదువు చెప్పాలని, ఐదు సంవత్సరాలలో రాయడం, చదవడం, గణిత కౌశలాలు వచ్చే విధంగా దీనిని యుద్ధ ప్రాతిపదిక మీద ఒక ఉద్యమంలా చేయాలని ప్రతిపాదించారు.



కొన్ని సంవత్సరాలుగా బడికి వెళుతూ వివిధ తరగతులలో ఉన్న చదువులో వెనుకబడిన విద్యార్థులకు బోధించే బాధ్యతలను తెలివైన విద్యార్థులకు, విద్యా కార్యకర్తలకు, స్వచ్ఛంద కార్యకర్తలకు ఇవ్వడం విద్యాశాఖను బాధ్యతల నుంచి తప్పించడం అవుతుంది తప్ప ఫలితాలు రావడం కష్టమే. విద్యాహక్కు చట్టం ప్రకారం 8వ తరగతి వరకు నాన్ డిటెన్షన్ విధానం కొనసాగాలి. కొన్ని రాష్ట్రాలు 3, 5, 8 తరగతులకు పరీక్షలు నిర్వహించే వెసులుబాటు ఇవ్వటానికి చట్టం సవరణ జరిగింది. ఈ వెసులుబాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలి వేశారు. కానీ నూతన విద్యావిధానం 3, 5, 8 తరగతులకు పరీక్షలు పెట్టే ఆలోచనలను మళ్ళీ ముందుకు తెచ్చింది. ఇలా చదువు చెప్పే బాధ్యత బడి తీసుకోకుండా ఆ బాధ్యతను పిల్లల మీద రుద్దడం వల్ల పిల్లలు బడి మానివేసే అవకాశాలు ఎక్కువవుతాయి. ఒక వైపు బడి బయట ఉన్న పిల్లలను బడికి తీసుకు రావాలని విధానాలు రూపొందిస్తూ మరో పక్క పరీక్షల పేరుతో బడి మానిపించే విధానాల రూపకల్పన సమంజసం కాదు.



నూతన జాతీయ విధానం స్థానిక ప్రభుత్వాల పాత్రను పూర్తిగా విస్మరించి పాఠశాల సముదాయాల ద్వారా కృత్రిమ మేధస్సు ద్వారా, అంటే కేంద్రీకృత డిజిటల్ సాధనాల పాఠశాల విద్యా పాలనను అందించాలని ప్రతిపాదించింది. ప్రపంచంలో ఎక్కడైనా విద్యను అందించడంలో విజయవంతం అయ్యారంటే వికేంద్రీకరణ ద్వారానే సఫలమయ్యారు. మన దేశంలో కేరళ కూడా అదే బాటలో నడుస్తోంది. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక ప్రభుత్వాలకు విద్యను అందించే, పర్యవేక్షించే అధికారాలు ఉన్నాయి. రాజ్యాంగం కలిగించిన అధికారాన్నే కాకుండా స్థానికంగా విద్యా యంత్రాంగం జవాబుదారీతనాన్ని పెంచాలంటే స్థానిక ప్రభుత్వాలకు పాత్ర ఇవ్వకపోవడం పెద్ద లోపమే.



బడి బయట పిల్లలు, బాలకార్మికులు: దేశంలో 6 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న విద్యార్థులు 6.2 కోట్ల మంది బడి బయట ఉన్నట్లు కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. నూతన విద్యావిధానం ద్వారా వీరిని మళ్ళీ బడికి రప్పించి వీరి వయసుకు తగ్గ తరగతిలో చేర్పించే ప్రక్రియల గురించి కొత్త విధానం ఏం సూచించలేదు. పైగా కరోనా విపత్తు మూలంగా బడి మానేసే పిల్లల సంఖ్య కొన్ని రెట్లు ఎక్కువగా పెరిగిపోతుందని పలు నివేదికలు చెబుతున్నాయి.



మాతృభాష, స్థానికభాష, అమ్మభాషలో ప్రాథమిక విద్య ఉంటే బాగుంటుందని సూచించారే తప్ప ఒక కచ్చితమైన విధాన నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఇది కేవలం ప్రభుత్వ పాఠశాలలకే పరిమితమా ఆయా రాష్ట్రాలలో నడుస్తున్న ప్రైవేట్‌ పాఠశాలలకు కూడ వర్తిస్తుందా అనే దానిపై కూడా స్పష్టత లేదు.



వృత్తి విద్య: 6వ తరగతి నుంచి వృతి విద్యాకోర్సులు ప్రవేశపెడతామని సూచించారు. 21వ శతాబ్దపు నైపుణ్యాల దిశగా పెంపొందించే విద్యావిధానం రూపొందిస్తున్నారని చెబుతూనే వడ్రంగి, ఎలక్ట్రీషియన్, కంసాలి, కుండల తయారీ మొదలగు వృత్తుల గురించి తెలుసుకోవాలని సూచించారు. ఇవి పేద వర్గాల పిల్లల కోసమే అన్నట్లుగా మిగిలి, 21వ శతాబ్దపు నైపుణ్యాలు ఉన్నత వర్గాల పిల్లలకు మాత్రమే చెందే ప్రమాదముంది. అంతే కాకుండా విద్యావిధానాన్ని మార్కెట్‌కు అనుసంధానం చేయడం, కావలసిన నైపుణ్యాలను పెంపొందించడం బాగానే ఉన్నా అతి చౌకగా దొరికే లేబర్ కోసం మార్కెట్ ఎప్పుడూ చూస్తూనే ఉంటుందనే విషయాన్ని పరిగణనలో ఉంచుకోవలసింది. అందులో బాలకార్మికులను పనిలో పెట్టుకునే సంప్రదాయం నుంచి బయట పడలేదింకా. నూతన విద్యావిధానం 18 సంవత్సరాల లోపు పిల్లలను బాలకార్మికులుగా నియమించుకోవద్దని స్పష్టం చేసింది. బాలకార్మిక చట్టాన్ని కూడా సవరించాల్సిన అవసరముంది. బడికి ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా మానేయవచ్చు అనే వెసులుబాటు కూడా బాల కార్మిక వ్యవస్థకు దోహదం చేస్తుంది.



సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన సమూహాల విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా ప్రత్యేక విద్యాప్రాంతాలను (ఎస్.ఇ.జెడ్.) కేంద్రం ఇంతకుముందే ప్రకటించినా యాస్పిరేషనల్ జిల్లాలలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన సమూహాలు ఇంకా ఉన్నాయి. అందువల్ల వారి పిల్లల చదువుకు అదనపు శ్రద్ధతో, అదనపు నిధులు ఖర్చు చేసి సదరు ప్రాంతాలలో ఉన్న పిల్లలకు విద్యనందించాలని ప్రతిపాదించారు. దీంట్లో ఉన్న సమస్య ఏమిటంటే– అభివృద్ధి చెందినవని అనుకున్న ప్రాంతాలలో నివసిస్తున్న వెనుకబడ్డ సమూహాల పిల్లలకు ఆ ప్రయోజనాలు సమకూరకపోవడం. ప్రతి అభివృద్ధి చెందిన ప్రాంతంలోనూ వెనుకబడ్డ సమూహాలు ఉంటాయి. ఉదాహరణకు హైదరాబాదు నగరం ఈ నిర్వచనం ప్రకారం ప్రత్యేక విద్యాప్రాంతం కిందకు రాదు. కనుక ఇక్కడ నివసిస్తున్న వెనుకబడిన సమూహాల పిల్లలు ఈ అవకాశాలకు దూరమవుతారు. వెనుకబడిన వర్గాల పిల్లలు దేశంలో ఎక్కడ ఉన్నా వారికి విద్యనందించడానికి అదనపు కార్యక్రమాలు, విధానాలు రూపొందించాలి కానీ ఇలా ప్రత్యేక ప్రాంతాలుగా ప్రతిపాదించడం తగదు.



చివరగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, మోడల్ స్కూల్స్‌, కేజీబివిలు, ఆశ్రమ పాఠశాలలు వంటి రకరకాలైన బడులు ఒక వైపు ఉంటే, మరో వైపు పిండి కొద్దీ రొట్టె అన్నట్లుగా సమాజంలో ఉన్న వివిధ ఆదాయ వర్గాలకు అనుగుణంగా ప్రైవేటు బడులకు అనుమతులు ఇస్తూ ఉన్నంత కాలం నాణ్యమైన విద్య, 21వ శతాబ్దపు అవసరాలకు తగ్గ విద్యకు సంబంధించి మన విద్యావిధానంలో విప్లవాత్మక మార్పుల్ని చూడలేము. దేశంలోని బాలలందరికీ నాణ్యమైన సమాన విద్య నందించాలి. అన్ని ఆదాయ వర్గాలకు సకల సామాజిక సమూహాల పిల్లలకు వారివారి పరిసర ప్రాంతాలలో సమగ్ర వసతులతో నాణ్యమైన విద్యను సమకూర్చే పాఠశాలలను ప్రభుత్వాలే ఏర్పాటు చేయాలి. అంతేకాక, ప్రతి ఒక్కరూ ఆ పాఠశాలలోనే చదువుకోవాలనే విధానం రానంత వరకు, పాఠశాల విద్య మౌలిక వాస్తవాలు మారవని గుర్తించాలి.

ఆర్. వెంకట్ రెడ్డి

జాతీయ కన్వీనర్, ఏం.వి.ఫౌండేషన్

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top