అమరాతి రైతుల కోసం లాయర్ పరాశరన్ ..!
లాయర్ పరాశరన్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు.. కానీ అయోధ్య రామమందిరం కోసం. దశాబ్దాల పాటు సుప్రీంకోర్టులో పోరాడిన లాయర్ పరాశరన్ అంటే.. తెలియని వారు ఉండరు. 90 ఏళ్లు దాటినా కూడా ఆయన న్యాయం కోసం పని చేస్తూనే ఉన్నారు. వయసు మీద పడినందున ఆయన కూర్చుని వాదనలు వినిపించవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పినా. దాన్ని సున్నితంగా తిరస్కరించి ఆ వయసులోనూ నిల్చునే వాదనలు వినిపించేవారు. అయోధ్య రామాలయ నిర్మాణం సాకారం కావడానికి కారకుల్లో ఒకరు అయిన పరాశరన్ ఇప్పుడు.. న్యాయం కోసం అమరావతి రైతుల వైపు నిలబడాలని నిర్ణయించుకున్నారు.
రైతుల తరపున సుప్రీంకోర్టులో వాదించేందుకు అంగీకరించారు. రెండు రోజుల కిందట జరిగిన రాజధాని భూముల్లో ఇళ్ల స్థలాల విషయంలో జరిగిన వాదనల్లో..
పరాశరన్ కూడా పాల్గొన్నారు. అమరావతి రైతులు.. తమకు న్యాయం కోసం ఢిల్లీ స్థాయిలో పోరాడుతున్నారు. సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్లను పెట్టుకుంటే పెద్ద ఎత్తున ఫీజు ముట్టచెప్పాల్సి ఉంటుంది. అందుకే రైతులు.. న్యాయం కోసం పోరాడే ప్రముఖ న్యాయవాదుల్ని కలిసి.. తమకు ప్రభుత్వం తెచ్చి పెట్టిన కష్టం గురించి.. చేస్తున్న అన్యాయం గురించి వివరించి. పెద్ద మొత్తంలో ఫీజు ఇచ్చుకోలేమని.. వాదించాలని కోరుతున్నారు. కొంత మంది లాయర్లు కేసు తీవ్రత దృష్ట్యా వాదించడానికి అంగీకరిస్తున్నారు.
పరాశరన్ కూడా.. అమరావతి రైతుల కష్టాలు విని. రూపాయి ఫీజు తీసుకుని.. వారి తరపున సుప్రీంకోర్టులో వాదించేందుకు సిద్ధమయ్యారని రైతులు చెబుతున్నారు. పరాశరన్తో పాటు కొంత మంది లాయర్లు.. రాజధాని రైతుల కోసం సుప్రీంకోర్టులో వాదించనున్నారు. మిగతా వారి సంగతేమో కానీ.. పరాశరన్ అనే పేరు మాత్రం.. అమరావతి రైతులకు భరోసా ఇస్తోంది.

0 comments:
Post a comment