✍️పరీక్షలకు సిద్ధం
●సీఎం ప్రకటనతో వర్సిటీల్లో కదలిక
●అక్టోబరులో తరగతులు
🍁న్యూస్‌టుడే, తిరుపతి(ఎస్వీయూ) :
🔰సెప్టెంబరులో పరీక్షలు.. అక్టోబరులో తరగతులంటూ.. గురువారం అమరావతిలో ఉన్నత విద్యాశాఖతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో డిగ్రీ, పీజీ కళాశాలల్లో కదలిక వచ్చింది. రాష్ట్రంలోకే అత్యధిక వర్సిటీలు జిల్లాలో ఉన్నాయి. శ్రీవేంకటేశ్వర వర్సిటీకి అనుబంధంగా జిల్లావ్యాప్తంగా దాదాపు 150 డిగ్రీ, పీజీ అనుబంధ కళాశాలలున్నాయి. మార్చి 22న జనతా కర్ఫ్యూతో మూతపడిన కళాశాలలు ఇప్పటి వరకు తెరచుకోలేదు. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖతో గురువారం ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో పరీక్షల నిర్వహణ, తరగతుల ప్రారంభంపై ప్రాథమికంగా ఓ స్పష్టమైన ప్రకటన వెల్లడైంది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ప్రవేశాల ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, అధికారులు పరీక్షల నిర్వహణకు సన్నద్ధమౌతున్నారు.
🍁సెప్టెంబర్‌లో పరీక్షలు
🔰సెప్టెంబరు నెలలో పెండింగ్‌లో ఉన్న చివరి సెమిస్టర్ పరీక్షలను నిర్వహించడంతో పాటు, అక్టోబరు 15 నుంచి తరగతుల నిర్వహణకు సైతం ఎస్వీయూ అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇటు ఆన్లైన్ కానీ, అటు ఆఫ్‌లైన్ కానీ.. ప్రభుత్వం ఏ విధానంలో తరగతులు ప్రారంభించాలని సూచించినా తదనుగుణంగా ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. అధికార వర్గాల సమాచారం మేరకు ప్రత్యక్ష తరగతుల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. సెప్టెంబరులో నిర్వహించాల్సిన సెమిస్టర్ పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లను ఎస్వీయూ ఇప్పటికే పూర్తిచేసింది. పరీక్ష కేంద్రాల ఏర్పాటు, ప్రశ్నపత్రాల ముద్రణ తదితర కార్యక్రమాలు పూర్తయ్యాయి. డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం అందిన వెంటనే పరీక్షలను నిర్వహిస్తామని రిజిస్ట్రార్ శ్రీధర్‌రెడ్డి గురువారం ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. గురువారం జరిగిన ఉన్నత విద్యాశాఖ సమీక్షకు సంబంధించిన నిర్ణయాలు అధికారికంగా అందిన వెంటనే జిల్లాలోని అన్ని కళాశాలలకు సమాచారమిస్తామని వివరించారు.

0 comments:
Post a comment