కరోనా విజృంభణ నేపథ్యంలో దేశంలో పాఠశాలలు మూతపడ్డాయి. దాంతో తిరిగి పాఠశాలలు ఎప్పుపడు ప్రారంభిస్తారా అన్నదానిపై ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఈ సంధర్బంగా స్కూళ్ళ ప్రారంభంపై సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు దశల వారీగా కేంద్రం స్కూళ్ళు తెరిచేందుకు సిద్దం అవుతోందని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కాగా ఇప్పుడు తాజాగా డిసెంబర్ వరకు స్కూళ్ళు మూసి ఉంచుతారనే వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ట్విట్టర్ లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) "సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని.స్కూల్స్ రీ-ఓపెన్ చేసేందుకు కేంద్రం ఇంకా ఎలాంటి తేదీని నిర్ణయించలేదని" స్పష్టం చేసింది.
మరోవైపు WHO సైతం కరోనా ఉదృతి కారణంగా స్కూళ్లను ప్రారంభించకూడదని హెచ్చరిస్తోంది. ఇక కరోనా ను పట్టించుకోకుండా అమెరికాలో ట్రంప్ సర్కార్ స్కూళ్ళు తెరవడంతో కేవలం రెండు వారాల్లోనే లక్షకు దగ్గరగా విద్యార్థులు కరోనా బారిన పడ్డారు.
0 comments:
Post a comment