సలహాదారుల విషయంలోనూ ఏపీ సర్కార్ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం కోలువు దీరిన తర్వాత ప్రభుత్వ సలహాదారుల నియామకం ఓ ప్రహసనంగా మారిందనే విమర్శ ఉంది. ప్రభుత్వ సలహాదారుల్లో చాలా మందికి చేయదగిన పని ఏమీ లేదన్న ప్రచారం జరుగుతోంది. సజ్జల రామకృష్ణా రెడ్డి, జీవీడీ కృష్ణ మోహన్ వంటి సీఎంతో నేరుగా మాట్లాడే వాళ్లు మినహా మిగతా వాళ్లకు పెద్ద పని ఉండడం లేదు. అయితే, వీరంతా క్యాబినెట్ ర్యాంకును అనుభవించడం మీద అధికార పార్టీలోనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
కొందర్ని సలహాదారు అని వ్యవహరించకపోయినా... ప్రత్యేక అధికారి, కార్యక్రమ నిర్వహకుడు వంటి పేర్లతో నియమించారు. వీరందరికీ క్యాబినెట్ హోదాను ప్రభుత్వం కల్పించింది.
ఇంకొందర్ని నేరుగా వివిధ శాఖల కింద సలహాదారులుగా నియమించింది ప్రభుత్వం. వీరికి ఒకొక్కరికి జీత-భత్యాల కింద నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు చెల్లిస్తోంది ప్రభుత్వం. దీనికి తోడు... పీఎస్, అడిషనల్ పీఎస్, అటెండర్, డ్రైవర్ల వంటి సిబ్బంది జీతాలు, కార్యాలయ ఖర్చు కూడా కలిపితే ప్రజాధనం భారీగానే వృధా అవుతోంది. ఈ క్రమంలో సలహాదారుల సంఖ్యను తగ్గించే ఆలోచనలో ఉన్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం.
ప్రభుత్వ సలహాదారులకు పదవీ కాలాన్ని రెండేళ్లుగా నిర్ధారించింది ప్రభుత్వం. ఈ కాలపరిమితి పూర్తయిన తర్వాత అక్కర్లేదు అనుకున్న వాళ్లను కొనసాగించ కూడదనే ఆలోచనలో ఉంది జగన్ సర్కార్. ఎంత మంది సలహాదారులు ఉన్నారు? వాళ్ల సేవలు ప్రభుత్వానికి ఎలా ఉపయోగపడుతున్నాయి? అనేది అంచ వేసుకున్నాక... దీనిపై విధానపరమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

0 comments:
Post a comment