ప్రాథమిక విద్య వరకూ మాతృభాషలోనే బోధించాలన్న నిబంధన ఎక్కడా లేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. జాతీయ విద్యా విధానంపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని ఇప్పటికే స్పష్టం చేశామని తెలిపారు. కరోనా వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా విద్యా శాఖ ప్రణాళిక మొత్తం తారుమారైందని, విద్యార్థులకు కనీసం పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొందని అభిప్రాయపడ్డారు. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించే ‘విద్యా వారధి’ వాహనాలను మంత్రి శుక్రవారం విజయవాడలో ప్రారంభించారు. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం(టీవీ, కంప్యూటర్, సెల్ఫోన్) అందుబాటులో లేని 1.18 లక్షల మంది విద్యార్థుల కోసం వీటిని రూపొందించారు. విద్యావారధి సిలబస్ పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తితో పాఠశాలలు నిర్వహించలేని పరిస్థితి నెలకొందని, విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యేవరకూ అన్ని జిల్లాల్లో విద్యావారధి వాహనాల ద్వారా పాఠాలు బోధించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఒకటి నుంచి పదో తరగతి వరకూ డిజిటల్ విధానంలో తరగతులు నిర్వహిస్తామని వివరించారు.
మాతృభాషలోనే బోధన నిబంధన ఎక్కడా లేదు - కరోనాతో విద్యాశాఖ ప్రణాళిక తారుమారు: మంత్రి సురేష్

0 comments:
Post a comment