Best Masks to stop Coronavirus spread: కరోనా నేపథ్యంలో మాస్క్ ధరించడం అందరి జీవితంలో భాగమైపోయింది. అయితే ఈ వైరస్ వ్యాప్తి నిరోధించాలంటే ఎలాంటి మాస్క్‌లు ధరించాలన్న అంశంపై అమెరికా డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. 'లేజర్ సెన్సర్ డివైజ్'తో 14 రకాల మాస్క్‌లు, ఫేస్ కవరింగ్స్‌ను వారి పోల్చి చూశారు. ఈ మాస్క్‌లు ధరించి మాట్లాడినప్పుడు వారి నుంచి తుంపర్లు ఏ దిశలో ప్రయాణించాయి? వాటిని అడ్డుకోవడంలో మాస్క్‌లు ఏ మేరకు సమర్థంగా పనిచేశాయన్న దానిని వారు అధ్యయనం చేశారు. వీటిని లేజర్ బీమ్, లెన్స్, మొబైల్ ఫోన్ కెమెరాతో పరిశీలించారు. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి కారక తుంపర్లను నిరోధించడానికి వాల్వ్‌లు లేని ఎన్-95 మాస్క్‌లే అత్యుత్తమమైనవని వారు తేల్చారు.
వీటి తరువాత త్రీ లేయర్ మాస్క్‌లు మంచివని వారు వెల్లడించారు. ఆ తరువాత కాటన్-పాలిప్రోలిన్-కాటన్ మాస్క్‌లు మూడోస్థానంలో, టూ లేయర్ పాలిప్రోపిలిన్ ఏప్రాన్ మాస్క్‌లు నాలుగో స్థానంలో నిలిచాయి. ఇక వదులైన బట్టతో చేసినవి, ఫేస్ కవరింగ్స్ వంటివి మాస్క్‌లు ధరించకుండా ఉన్న దాంతోనే సమానమని తెలిసింది. వాల్వ్‌లున్న ఎన్-95 మాస్క్‌లు సమర్ధంగా తుంపర్ల వ్యాప్తిని అడ్డుకోలేకపోతున్నాయని వారి అధ్యయనంలో తేలింది. మాట్లాడేటప్పుడు, గాలిని బయటకు వదిలినప్పుడు ఎన్-95 మాస్క్‌కున్న వాల్వ్‌లు తెరుచుకోవడం వల్ల పరిసరాల్లోని వ్యక్తులకు తుంపర్ల నుంచి రక్షణ తగ్గుతోందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. అయితే వీటిపై మరింతగా పరిశోధించాల్సిన అవసరముందని డ్యూక్ వర్సిటీ పరిశోధకుడు ఎమ్మా ఫిషర్ తెలిపారు.

0 comments:
Post a comment