తెరమీదకు 'బ్యాడ్ బ్యాంక్' ఏర్పాటు ప్రతిపాదన...Bad Bank అంటే ఏమిటి?
మొండి బాకీలు(NPA) భారీగా పెరిగిపోతుండటం బ్యాంకులకు పెద్ద సమస్యగా మారుతోంది. లాక్డౌన్ నేపథ్యంలో మొండి బాకీలు మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. 2020 నాటికి బ్యాంకుల్లో మొండి బాకీలు 8.5శాతంగా ఉండగా...ఇది 2021 మార్చినాటికి 12.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. దీంతో మొండి బాకీల ఖాతాలను ఒక సంస్థకు బదిలీ చేసి సత్వరం ఆ ఖాతాలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలన్న ప్రతిపాదన మళ్లీ తెరమీదకు వచ్చింది. అటువంటి సంస్థనే 'బ్యాడ్ బ్యాంక్' అని వ్యవహరిస్తారు. 2017 ఎకనామిక్ సర్వేలోనే బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన చేశారు. బ్యాంకులకు చెల్లించాల్సిన మొండి బాకీలపై వడ్డీ మాఫీతో పాటు లంచాలకు తావులేకుండా బ్యాడ్ బ్యాంక్ త్వరితగతిలో నిర్ణయం తీసుకునే అవకాశముంటుంది.
రుణ చెల్లింపుదారుడి ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుని..అతను చెల్లించాల్సిన రుణం విషయంలోనూ బ్యాడ్ బ్యాంగ్ నిర్ణయం తీసుకుని కేసు సత్వర పరిష్కారానికి కృషి చేసే అవకాశం ఏర్పడుతుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు తప్పనిసరిని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. మొండి బాకీల పరిష్కారం కోసం సాధారణ బ్యాంకుల కంటే బ్యాడ్ బ్యాంకు మరింత సమర్థవంతంగా వ్యవహరించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. బ్యాంకుల్లో పేరుకుపోతున్న మొండి బాకీల వసూలుకు దీనికంటే మించిన మరొక పరిష్కారం కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు.
మొండి బాకీల వసూలు కోసం కొన్ని దేశాల్లో బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారని...ఈ ప్రయోగం విజయవంతమైందని దువ్వూరి గుర్తుచేశారు. 'దనహర్త ఆఫ్ మలేషియా' దీనికి ఒక మంచి ఉదాహరణగా పేర్కొన్నారు. మన దేశంలో కూడా బ్యాడ్ బ్యాంకును ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థను అధ్యయనం చేయటం మంచిదని సలహా ఇచ్చారు.

0 comments:
Post a comment