నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం కీలకం కానుంది. సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల పై చర్చించనున్నారు. అలాగే కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై కూడా చర్చించనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు పై కమిటీ వేయడంతో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పై కూడా ప్రధానంగా చర్చించనున్నారు. మూడు రాజధానుల అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే హైకోర్టు ఆగస్ట్ 27 వరకు స్టే విధించింది.
దీనిపై కూడా చర్చించనున్నారు. మరోవైపు ఇదే అంశంపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ అంశం కూడా చర్చకు రానుంది.
0 comments:
Post a comment