రాజ్యసభ ఎంపీ, ఉత్తర్ ప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 64 సంంత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అమర్ సింగ్ కొన్నాళ్లుగా సింగపూర్‌లో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో ఆయన కుటుంబం కూడా ఐసీయూలో అమర్ సింగ్ పక్కనే ఉన్నట్టు తెలిసింది. 2013లో కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడ్డారు అమర్ సింగ్.
అమర్ సింగ్ 1956 జనవరి 27న ఉత్తర్ ప్రదేశ్‌లో జన్మించారు. యూపీలో సమాజ్ వాదీ పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఆ పార్టీ తరఫున రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. అయితే, ఎస్పీలో ములాయం సింగ్‌తో ఉన్న విబేధాల కారణంగా 2010లో పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. అనంతరం ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఎస్పీ నిర్ణయం తీసుకుంది.
యూపీఏ 1 హయాంలో న్యూక్లియర్ డీల్ సందదర్భంగా కేంద్రంలో కాంగ్రెస్ సారధ్యంలోని ప్రభుత్వానికి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు ఉపసంహరించుకుంది. ఆ సమయంలో సమాజ్ వాదీ పార్టీ కేంద్రానికి మద్దతు ఇవ్వడంలో అమర్ సింగ్ కీలక పాత్ర పోషించారు. 39 మంది ఎంపీలు ఉన్న ఎస్పీ యూపీఏకు మద్దతు పలికింది.
సీనియర్ హీరోయిన్ జయప్రదను యూపీ రాజకీయాలకు పరిచయం చేసింది ఆయనే. అమర్ సింగ్‌ను బహిష్కరించిన సమయంలోనే జయప్రదను కూడా ఎస్పీ నుంచి గెంటి వేశారు. సినీ, వ్యాపార వర్గాలతో అమర్ సింగ్‌కు చాలా పరిచయాలు ఉన్నాయి. సమాజ్ వాదీ పార్టీని ఆర్థికంగా ఆదుకోవడానికి, గ్లామర్ తీసుకురావడానికి ఆయన ఎంతో చేశారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌తో కూడా అమర్ సింగ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఓ దశలో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన అమర్ సింగ్ ఆ తర్వాత బచ్చన్ సలహాతోనే సొంత బ్లాగ్ ప్రారంభించారు.
2011లో అమర్ సింగ్ సొంత రాజకీయ పార్టీ రాష్ట్రీయ లోక్ మంచ్ నెలకొల్పారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలోని 403 యోజకవర్గాలకు గాను 360 చోట్ల తన పార్టీ అభ్యర్థులను బరిలో దింపారు. కానీ, ఒక్క సీటు కూడా రాలేదు.
అమర్ సింగ్ అనుభవించిన పదవులు..
1996లో రాజ్యసభకు ఎంపిక2002లో రెండోసారి రాజ్యసభకు ఎంపిక
2008లో మూడోసారి రాజ్యసభకు ఎంపిక
2016లో నాలుగోసారి రాజ్యసభకు ఎంపిక
కేంద్రంలోని పలు కమిటీల్లో సభ్యుడిగా కూడా సేవలు అందించారు.
0 comments:
Post a comment