రాజధాని పిటిషన్లపై విచారణ 27కి వాయిదా
అమరావతి: ఏపీ రాజధానికి సంబంధించిన పలు వ్యా్జ్యాలపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు గెజిట్ నోటిఫికేషన్, ప్రభుత్వ కార్యాలయాల తరలింపు, హైకోర్టు శాశ్వత భవనాల నిర్మాణం తదితర అంశాలపై దాఖలైన దాదాపు 55 పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
మూడు రాజధానులు అనేవి విభజన చట్టానికి విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. విభజన చట్టంలో ఒక్క రాజధాని ప్రస్తావన మాత్రమే ఉందని వివరించారు. పిటిషన్లను ప్రత్యక్ష పద్ధతిలో విచారించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోరగా... కొవిడ్ వల్ల ప్రత్యక్ష విచారణకు హాజరుకాలేమని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు తెలిపారు. రాజధాని తరలింపుపై స్టేటస్ కో ఉత్తర్వులు ఈనెల 27వరకు అమల్లో ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టాల అమలుపై ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. విచారణ ఈనెల 27కు వాయిదా వేసింది.
0 comments:
Post a comment