60 ఏళ్లకు రిటైర్మెంట్...
వయో పరిమితి పెంపుపై ఆర్డినెన్స్?
రేపటి కేబినెట్ భేటీలో ఇదే టేబుల్ ఎజెండా
ఆమోదించి.. అదే రోజు వెల్లడించే అవకాశం
లేదంటే పంద్రాగస్టున వెలువడనున్న ప్రకటన
నెలాఖరున విరమణ చేసే వారికి అవకాశం
పెండింగ్‌లో ఉన్న పీఆర్సీకి మోక్షం
హైదరాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశఽం మళ్లీ తెరపైకొచ్చింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన బుధవారం జరిగే కేబినెట్ సమావేశంలో దీన్ని టేబుల్ ఎజెండాగా పెట్టి.. చర్చించి, ఆమోదించాక పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్‌ను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది. దీనిపై... అదే రోజున...కుదరకపోతే పంద్రాగస్టున సీఎం కేసీఆర్ ప్రకటన చేయనున్నట్లు తెలిసింది.
ఉద్యోగుల వయోపరిమితిని 58 ఏళ్ల నుంచి 60 లేదా 61 ఏళ్లకు పెంచుతామని ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం విదితమే. దీనివల్ల ఆర్థికంగా ఎంత భారం పడుతుందనే అంశంపై అధ్యయనం చేసి, నివేదిక అందించే బాధ్యతలను వేతన సవరణ కమిషన్(పీఆర్సీ)కు ప్రభుత్వం అప్పగించగా.. మూడు నెలల కిందటే నివేదికను అందజేసినట్లు తెలిసింది. వాస్తవానికి ఉద్యోగులకు సంబంధించి మూడు డీఏలతోపాటు పీఆర్సీ, వయో పరిమితి పెంపు వంటి హామీలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో ఒక డీఏతోపాటు వయోపరిమితి పెంపుపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని సమాచారం. శ్రావణమాసం కావడం.. 17వ తేదీ వరకూ మంచి ముహూర్తాలు ఉండటంతో 15వ తేదీలోపే నిర్ణయం వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఉద్యోగ విరమణ అనంతరం ప్రయోజనాల చెల్లింపు సైతం.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి భారంగానే మారింది. ఒక ఉద్యోగి పదవీ విరమణ చేస్తే దాదాపు రూ.50లక్షల దాకా గ్రాట్యుటీ, ఇతరత్రా ప్రయోజనాలు చెల్లించాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో ప్రతి నెలా సగటున 600 నుంచి 1000 మంది ఉద్యోగ విరమణ చేస్తుంటారు. ఆగస్టులో ఏకంగా 1200 నుంచి 1400 మంది రిటైర్ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వయోపరిమితి పెంపుపై కీలక నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయి. టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి కూడా ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. తనకొక్కడికే ఎక్స్టెన్షన్ ఇస్తే... తప్పుడు సంకేతాలు వెలువడే అవకాశం ఉందని, అందరితో పాటే తనకూ మేలు చేయాలని ఆయన కోరుతున్నట్లు తెలిసింది. అయితే, వ యోపరిమితిని 60 ఏళ్లకు పెంచుతారా? లేక 61 ఏళ్లుగా మార్చుతారా? అనేది సీఎం కేసీఆర్ చేతిలోనే ఉంది. ఆర్డినెన్స్ జారీతో పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్‌ను సవరించి... ఆ తర్వాత జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో దాన్ని ఆమోదించే అవకాశాలున్నాయి. వయోపరిమితి పెంపుతో ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేసే వారికి సైతం ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం ఉద్యోగులు, టీచర్ల వయోపరిమితి 58 ఏళ్లు ఉండగా... నాలుగో తరగతి ఉద్యోగులకు 60 ఏళ్లుగా ఉంది.

0 comments:
Post a comment